'బిజినెస్ మ్యాన్' బాటలోనే రామ్ చరణ్ 'రచ్చ'?
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ కూడా మహేష్ బిజినెస్ మ్యాన్ బాటలోనే నడుస్తోందని విశ్లేషుల మాట. బిజినెస్ మ్యాన్ చిత్రం ఎక్కువ ధియోటర్స్ లో విడుదల చేసి వారం తిరగకుండానే మొత్తం వసూలు చేసే ప్లానింగ్ దిశలోనే రచ్చ నిర్మాతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ ధియోటర్స్ లో విడుదల చేయకపోతే ఫ్యాన్స్ ఫీలవుతారనే కారణం చూపెట్టి ఇలా ట్రేడ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బిజినెస్ మ్యాన్ కు మొదటి వారంలో డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ కు లోటు లేకుండా ముందుకు దూసుకు వెళ్లింది. ఇప్పుడు ఇదే స్కీమ్ ని ఫాలో అయితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు హ్యాపీగా ఉంటుందని అంటున్న్రారు.
ఇక రచ్చ చిత్రానికి సైతం విపరీతమైన క్రేజ్ ఉండటం ఈ వ్యూహానికి సహకరిస్తుందని చెప్తున్నారు. రామ్ చరణ్,తమన్నా కాంబినేషన్ లో రూపొందిన రచ్చ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందింది. గతంలో మగధీర చిత్రంలో కూడా చిరంజీవి సూపర్ హిట్ పాట 'బంగారు కోడి పెట్ట' పాటను రీమిక్స్ చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా వాన వాన వెల్లువాయే పాట కూడా రచ్చ సినిమాకు మంచి అసెట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. పరాస్ జైన్, ఎన్వీ ప్రసాద్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











