Game Changer: దటీజ్ రామ్ చరణ్..టాలీవుడ్లో ఆ రెండు సెంటిమెంట్లు చితక్కొట్టిన గ్లోబల్ స్టార్!

టాలీవుడ్ సినీ పరిశ్రమలో చలా వరకు పలు సెంటిమెంట్స్ ని మనం ఫాలో అవుతాం అని అందరికీ తెలిసిందే. అది సినిమా టైటిల్ లో మొదలయ్యే అక్షరం నుంచి ఆ సినిమాలో నటించే హీరోయిన్ వరకు చాలా విషయాల్లో ఈ సెంటిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీటోతో పాటుగా పలు సందర్భాల్లో ఆయా చిత్రాల తాలూకా ఫలితాలని కూడా డిసైడ్ చేసే సెంటిమెంట్స్ కూడా కనిపిస్తాయి.

వీటితో పాటుగా పలానా దర్శకుడుతో సినిమా చేస్తే ఆ హీరో నెక్స్ట్ సినిమా ఎవరితో చేసినా ప్లాప్ అవుతుంది అని ఇలా చాలా సెంటిమెంట్స్ తెలుగు సినిమాలో ఇన్నేళ్ళలో కనిపించాయి. కాగా ఈ తరహా అపోహలు సెంటిమెట్స్ లో మన తెలుగు సినిమా దగ్గర రాజమౌళి సెంటిమెంట్ అంటే తెలియని వారు ఉండరు. తనతో సినిమా చేసిన ఏ హీరో అయినా కూడా తన నెక్స్ట్ సినిమాకి కోలుకోలేని డిజాస్టర్ ని అందుకుంటాడు అని ఒక సెంటిమెంట్ మన దగ్గర ఉంది.

is ram charan broke this 2 myths in tollywood

ఇది తన మొదటి సినిమా నుంచి మొన్న ఆచార్య వరకు కడా కొనసాగింది. కాగా ఆచార్య లో మెయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవి అయినప్పటికీ తాను చేసిన కామెంట్స్ అప్పుడు వైరల్ అయ్యాయి. రాజమౌళితో వర్క్ చేసిన హీరోల సినిమాలు ప్లాప్ అవుతాయి అనే మిత్ ని ఆచార్య బ్రేక్ చేస్తుంది అని అన్నారు కానీ అది ఘోరంగా పరాజయం పాలయ్యింది. ఇక దీని తర్వాత ఎట్టకేలకి రామ్ చరణ్ నుంచో సోలో సినిమా ఇపుడు వచ్చింది.

రాజమౌళినే ఓజి దర్శకుడు అంటూ ఎలివేషన్ ఇచ్చిన ద్శకుడు శంకర్ తో రామ్ చరణ్ చేసిన సోలో సినిమా ఇది కాగా నేడు జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి ఈ సినిమా వచ్చింది. మరి ఈ సినిమా రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది అనే టాక్ మొదలైంది. రాజమౌళి సినిమా తర్వాత హీరోల సినిమాలు దారుణంగా డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంటాయి కానీ గేమ్ ఛేంజర్ కి దాదాపు పాజిటివ్ టాక్ మాత్రమే ఎక్కువ వచ్చింది. దీనితో ఈ అపోహని చరణ్ బ్రేక్ చేసాడని అంటున్నారు.

is ram charan broke this 2 myths in tollywood

ఇక ఇి కాకుండా మరో సిసలైన సెంటిమెంట్ కూడా ఉంది. ఈ జనవరి 10 డేట్ అంటే టాలీవుడ్ లో ఒక పీడ కల అని చెప్పాలి. కాగా ఈ డేట్ లో మన తెలుగు బిగ్ స్టార్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞ్యాతవాసి సినిమాలు 2014 అలాగే 2018 ఏడాదులలో వచ్చి తెలుగు సినిమా చూడని నష్టాలు మిగిల్చాయి. దీనితో అలాంటి ఒక డేట్ లో గేమ్ ఛేంజర్ వస్తుండడంపై కూడా చాలా అనుమానలు ఉన్నాయి. మరి ఫైనల్ గా దీనిని కూడా మంచి టాక్ అందుకొని గేమ్ ఛేంజర్ బ్రేక్ చేసింది అంటూ టాక్ అయితే ఇపుడు వైరల్ గా మారింది.

More from Filmibeat

Read more about: ram charan game changer rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X