Game Changer 250 కోట్లకు రాంచరణ్ మూవీ ఓటీటీ రైట్స్ అమ్మకం.. ఏ సంస్థ సొంతం చేసుకొన్నదంటే?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఒకటిగా చెప్పుకోవచ్చు. దక్షిణాదిలో సంచలన విజయాలు అందుకొన్న దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించకముందే.. ఓటీటీ బిజినెస్ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గేమ్ ఛేంజర్ ఓటీటీ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
వాయిదాలతో గేమ్ ఛేంజర్ షూట్:రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం దాదాపు గత రెండేళ్లకుపైగా సెట్స్‌పైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ మెల్లమెల్లగా షూటింగ్ జరుపుకొంటున్నది. అయితే ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పడం కష్టంగా మారింది. RRR తర్వాత రామ్ చరణ్ సినిమా ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ మూవీ ఆలస్యం వెనుక?:గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా షూటింగ్ ఆలస్యానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇండియన్ 2 సినిమాతో శంకర్ బిజీగా ఉండటం ఓ కారణం. అలాగే ఈ సినిమా మొదలైనప్పటీ నుంచి పలు విషయాల్లో రాంచరణ్ బిజిగా మారిపోయారు. కొన్ని రోజులు RRR ఆస్కార్ ప్రమోషన్స్ కోసం, అలాగే ఉపాసన డెలివరీ కోసం ఆయన గ్యాప్ తీసుకోవడం వల్ల గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది.

క్రేజీగా గేమ్ ఛేంజర్ డిజిటల్ బిజినెస్:ఇలాంటి సమస్యలతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ముందుకు సాగుతున్నప్పటికీ.. ఈ మూవీపై క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.దాంతో ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతుందని అందరూ లెక్కలు వేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ బిజినెస్‌కు మంచి ధర పలికిందనే విషయం మీడియాలో హల్‌చల్‌గా మారింది.

ప్రముఖ ఓటీటీ సంస్థకు :గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోవడానికి టాప్ ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయి. అయితే భారీ పోటీ మధ్య ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 (ZEE5) సంస్థ ఫ్యాన్సీ రేట్ చెల్లించి సొంతం చేసుకొన్నట్టు సమాచారం. రిలీజ్‌కు ముందే ఈ సినిమా బిజినెస్ డిజిటల్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్‌కు ఎన్ని కోట్లంటే? :ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా అన్ని భాషల హక్కులను సుమారు 250 కోట్ల రూపాయలకు జీ5 సంస్థ సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. అయితే నిర్మాత దిల్ రాజు గానీ, ఆయన యూనిట్ వర్గాలు కానీ ఈ వార్తను అధికారికంగా వెల్లడించలేదు. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్‌కు ముందే 250 కోట్ల రూపాయలు రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను 200 కోట్ల రూపాయలతో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











