Ram Charan Vs Nani: నానీ మూవీకి రాంచరణ్ ఎసరు? ఆ వార్‌ను సెటిల్ చేస్తారా?

ఇప్పుడు తెలుగు సినిమా నుంచి రానున్న రోజుల్లో కొన్ని గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించే సినిమాలు చాలానే రాబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. మెయిన్ గా మన నేటివిటీ కూడా మిస్ కాకుండా గ్లోబల్ ఆడియెన్స్ కి రీచ్ అయ్యే సినిమాలు మన హీరోలు అలాగే దర్శకులు కూడా ప్రయోగాత్మకంగా చేస్తూ వస్తున్నారు.

మరి ఈ క్రమంలో చేస్తున్న సినిమాల్లో కొన్నిసార్లు ఆయా హీరోలు దర్శకులు నిర్మాణ సంస్థల నడుమ ఖచ్చితంగా క్లాష్ తప్పదని చెప్పాలి. మరీ భారీ పాన్ ఇండియా సినిమాలు ఉంటే ఆ సమయం వర్ణనాతీతం. ఖచ్చితంగా ఎవరో ఒకరు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరి ఇలాంటి భారీ క్లాష్ రానున్న కొత్త ఏడాది 2026లో జరగనుంది ఏమో అని ఇపుడు నుంచే రూమర్స్ వినిపిస్తున్నాయి.

Ram Charan Vs Nani

కాగా మన తెలుగు సినిమా దగ్గర తన స్వశక్తితో భారీ స్టార్డం అండ్ మార్కెట్ ని తెచ్చుకున్న యువ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకడు. కాగా నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఇటీవల గ్లింప్స్ తోనే సంచలనం రేపిన సినిమా ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో అనౌన్స్ చేసిన ఈ చిత్రం ఏకంగా పాన్ వరల్డ్ భాషల్లో అనౌన్స్ చేయడమే కాకుండా వచ్చే ఏడాది మార్చ్ 26 డేట్ ని కూడా ముందే అనౌన్స్ చేసేసారు.

కానీ ఇపుడు దీనికి ఊహించని బ్రేక్ పడేలా ఉందని సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ డేట్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇపుడు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. కాగా ఇపుడు రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న సినిమాకి కూడా గ్లోబల్ లెవెల్ అపీల్ ఉంది. పైగా పాన్ ఇండియా లెవెల్లో అగ్ర తారాగణం, ఏ ఆర్ రెహమాన్ సంగీతం ఇలా ఎటు నుంచి చూసినా నాని ది ప్యారడైజ్ కి ధీటుగానే ఈ సినిమా ఉంటుంది.

కాగా ఈ సినిమాని ఇపుడు ఇపుడు మేకర్స్ అదే మార్చ్ 26న తీసుకొస్తున్నట్టుగా పలు పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఇదే కానీ నిజం అయితే నానికి పెద్ద దెబ్బే అని చెప్పక తప్పదు. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ పైగా ఊహించని బోల్డ్ అటెంప్ట్ కూడా అదే. దీనితో ఆ సినిమా తనకి ఎంతో ప్రత్యేకం ప్రతిష్టాత్మకం కూడా.

మరి ఇలాంటి డేట్ ని రామ్ చరణ్ టార్గెట్ చేస్తున్నాడు అంటూ ఖచ్చితంగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి వచ్చి సెటిల్ చేయాల్సిందే అని చెప్పక తప్పదు. ఎందుకంటే చిరంజీవి నెక్స్ట్ సినిమాకి ఇదే నాని నిర్మాత అలాగే ప్యారడైజ్ దర్శకునితోనే సినిమా చేయనున్నారు. మరి ఈ సినిమాపైనే భారీ అంచనాలు కూడా ఉన్నాయి. సో ఈ లెక్కన అటు తిరిగి ఇటు తిరిగి నానీ సినిమాకే మెగా హీరో తెలిసి కూడా ఎసరు పెడతా అంటే ఎలా కుదురుతుంది.

సో ఈ కీలక అంశంలో మాత్రమే మెగాస్టార్ చొరవ తీసుకొని సెటిల్ చేసేందుకు ఆస్కారం ఎక్కువ ఉండొచ్చు. ప్రస్తుతం ఆయులంటే రామ్ చరణ్ బర్త్ డే మార్చ్ 27న ఆ డేట్ ని మేకర్స్ రివీల్ చేస్తారని వినిపిస్తుంది. బహుశా వచ్చే ఏడాది మళ్ళీ చరణ్ బర్త్ డే కి ఒక్క రోజు ముందులా ప్లాన్ చేసుకుంటున్నారో ఏమో కానీ ఆ సినిమా మూలాన ముందే అనౌన్స్ చేసుకున్న నాని సినిమా బలైపోతుందేమో అని చెప్పాలి. సో ఈ కీలక క్లాష్ లో ఎవరు వస్తారు ఎవరు ఉండరు అనేవి వేచి చూడాల్సిందే.

Take a Poll

More from Filmibeat

Read more about: ram charan nani rc16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X