Don't Miss!
- News
ఘనంగా మొదలైన మేడారం మినీ జాతర.. నాలుగురోజుల పాటు సాగే వన సంబరం!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
బాహుబలి రికార్డుకు చేరువైన సైరా.. టాప్ ప్లేస్‌ను దక్కించుకుంటుందా.?
భారతదేశ సినీ చరిత్రలో 'బాహుబలి' సృష్టించిన రికార్డు అన్నీ ఇన్నీ కాదు. తెలుగు సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇండియన్ సినిమాపై ఇంతటి ప్రభావం చూపిన ఈ సినిమా సాధించిన ఓ రికార్డుకు ప్రమాదం వచ్చి పడింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా: నరసింహారెడ్డి' రూపంలో. దీంతో మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులందరూ ఈ రికార్డుపై కన్నేశారు. ఇంతకీ ఏంటా రికార్డు..? వివరాల్లోకి వెళ్తే..

ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు ఇదే
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి సరైన హిట్ ఇవ్వాలనే పట్టుదలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కానీ, కలెక్షన్లను రాబట్టడంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఒక్క తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో ‘సైరా' అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఊహించని కలెక్షన్లు
‘సైరా: నరసింహారెడ్డి' సినిమా విడుదలైన రోజు మంచి టాక్ సంపాదించింది. అదే సమయంలో కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టింది. అయితే, సినిమా బిజినెస్ ముగిసే సమయానికి మాత్రం ఊహించని కలెక్షన్లు రాబట్టింది. అంటే.. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలు, ప్రాంతాలను కలిపి మొత్తంగా రూ. 130 కోట్లు షేర్ దక్కించుకుంది. అలాగే, రూ. 300 కోట్లు గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది
‘సైరా:
నరసింహారెడ్డి'
ప్రీ
రిలీజ్
బిజినెస్
చూస్తే..
నైజాం,
ఏపీలో
రూ.107.4
కోట్లు,
కర్ణాటకలో
రూ.27
కోట్లు,
తమిళనాడులో
రూ.7.6
కోట్లు,
కేరళలో
రూ.2.5
కోట్లు,
మిగితా
దేశాల్లో
రూ.27.5
కోట్లు,
ఓవర్సీస్‌లో
రూ.20
కోట్లు
పలికింది.
మొత్తంగా
అన్ని
ఏరియాల్లో
కలిపి
ప్రపంచ
వ్యాప్తంగా
ఈ
చిత్రం
రూ.152.9
కోట్లు
థియేట్రికల్
బిజినెస్
నమోదైంది.
అయితే,
ఈ
సినిమా
క్లోజింగ్
బిజినెస్
రూ.133
కోట్ల
వద్ద
ఆగిపోవడంతో
దాదాపు
రూ.
20
కోట్లకు
పైగా
నష్టం
వచ్చినట్లు
ట్రేడ్
పండితులు
వెల్లడించారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘సైరా' నష్టాలను
మూటగట్టుకున్నట్లు ట్రేడ్ రిపోర్టుల ద్వారా వెల్లడైంది. అయితే, నైజాం ఏరియాలో మాత్రం ఈ సినిమా పలు రికార్డులను బద్దలు కొట్టే రీతిలో కలెక్షన్లు సాధించిందని తెలిసింది. ఈ సినిమా అమ్ముడు పోయిన దాని కంటే దాదాపు రూ. 2 కోట్లు ఎక్కువగా కలెక్ట్ చేసినట్లు రిపోర్టులు వచ్చాయి. ఒకానొక సమయంలో ఈ సినిమా ‘బాహుబలి' రికార్డును సైతం బద్దలు కొడుతుందని అన్నారు. అయితే, అది మాత్రం సాధ్యం కాలేదు.
Recommended Video

బాహుబలి రికార్డు చేరువ
మొదట హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. నష్టాలను మూటగట్టుకుంది ‘సైరా: నరసింహారెడ్డి'. అయితే, ఈ సినిమా అనంతపురం సెంటర్‌లో మాత్రం రూ. 2.40 కోట్లు సాధించింది. ఈ క్రమంలోనే ‘బాహుబలి' తర్వాత ఈ సెంటర్‌లో రూ. 2 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. అదే సమయంలో ‘బాహుబలి 2' సంపాదించిన కలెక్షన్లు రూ. 2.60 కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఇక్కడ కొన్ని సెంటర్లలో సైరా రన్ అవుతోంది. దీంతో బాహుబలి రికార్డును బద్దలు కొడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సైరా: నరసింహారెడ్డి గురించి
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించాడు. ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.