For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఇస్మార్ట్ శంకర్’ 4 డేస్ కలెక్షన్ రిపోర్ట్... లాభాలే లాభాలు!

|
iSmart Shankar 4th Day Collection Report || Filmibeat Telugu

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటించారు. జులై 18న విడుదలైన ఈమూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది.

ఆదివారంతో ఫస్ట్ వీకెండ్(4 రోజులు) పూర్తి చేసుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 22 .35 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. దీంతో విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేసి లాభాల బాటలోకి వెళ్లినట్లయింది.

అన్ని ఏరియాల్లోనూ లాభాలు

అన్ని ఏరియాల్లోనూ లాభాలు

నైజాం ఏరియాలో అత్యధిక లాభాలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ తొలి 4 రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు డిస్ట్రిబ్యూటర్‌కు రెండు కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై వచ్చే మొత్తం కూడా ప్రాఫిట్స్ ఖాతాలోనే పడనున్నాయి. అయితే ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం సినిమా కాస్త వెనకబడి ఉంది.

ఏరియా వైజ్ 4 డేస్ షేర్

ఏరియా వైజ్ 4 డేస్ షేర్

నైజాంలో రూ. 8.82 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 3.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.33 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.36 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.1.06 కోట్లు, గుంటూరు రూ. 1.36 కోట్లు, నెల్లూరు 72 లక్షలు రాబట్టింది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ ఈ మూవీ హౌస ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది.

రైట్స్ ఎంతకు అమ్మారు?

రైట్స్ ఎంతకు అమ్మారు?

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలకు కలిపి రూ. 14.90 కోట్లకు రైట్స్ అమ్మారు. తొలి 4 రోజుల్లోనే రూ. 20.28 కోట్లు వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 1.20 కోట్లకు అమ్మగా 4 రోజుల్లో పూర్తి పెట్టుబడి తిరిగి వచ్చింది. ఓవర్సీస్ రైట్స్ రూ. 90 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు రూ. 80 లక్షలు రికవరీ అయ్యాయి. వరల్డ్ వైడ్ రైట్స్ 17 కోట్లకు అమ్మగా... ఇప్పటి వరకు రూ. 22.35 కోట్లు వసూలు చేసింది. ఫుల్ రన్లో ఎంత రాబడుతుంది అనే అంశం ఆసక్తిగా మారింది.

ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్

రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

English summary
iSmart Shankar has collected a worldwide distributor share of 22.35 Cr in 4 days. Smart Shankar is a 2019 Telugu action comedy film produced and directed by Puri Jagannadh, under the banners of Puri Connects and Puri Jagannadh Touring Talkies. It is presented by Lavanya. It stars Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh and Satya Dev, with music composed by Mani Sharma.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more