twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇస్మార్ట్ శంకర్ క్లోజింగ్ కలెక్షన్లు: 200 శాతానికి పైగా లాభం.. ఎన్ని కోట్ల వసూళ్లంటే!

    |

    టాలీవుడ్ సినీ, ట్రేడ్ వర్గాలను, ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద రాణించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రామ్‌‌కు అవసరమైన సమయంలో సక్సెస్‌ను అందించిన సినిమాగానే కాకుండా టాలీవుడ్‌లో 2019 ఏడాదిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలువడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రేక్షకుల్లో ఓ రకమైన క్రేజ్‌ను నింపిన ఇస్మార్ట్ శంకర్ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

     200 శాతానికిపైగా లాభాలు

    200 శాతానికిపైగా లాభాలు

    ఇస్మార్ట్ శంకర్ థియేట్రికల్ హక్కులు రూ.17.25 కోట్లకు అమ్మడం జరిగిందనేది సినీ వర్గాల టాక్. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 202 శాతం లాభాలను రాబట్టింది. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో లాభాల పంట పండించిన సినిమా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ వసూల్లు సాధించిన చిత్రంగా మరో రికార్డును సొంతం చేసుకొన్నది.

     నైజాంలో భారీగా వసూళ్లు

    నైజాంలో భారీగా వసూళ్లు

    ఇస్మార్ట్ శంకర్ రిలీజై తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. నైజాంలో తొలి ఆట నుంచి భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం నైజాంలో వచ్చిన సక్సెస్ టాక్‌తోనే మిగితా ప్రాంతాల్లో మెరుగైన వసూళ్లు రాబట్టడానికి ప్రభావం చూపింది. నైజాంలోనే రూ.13.57 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఇక టాలీవుడ్‌కు సంబంధించిన 2019లో రెండో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఇస్మార్ట్ శంకర్ మరో ఘనతను సాధించింది.

     ఆంధ్రాల్లో కలెక్షన్ల కుమ్ముడు

    ఆంధ్రాల్లో కలెక్షన్ల కుమ్ముడు

    ఇక ఆంధ్రా విషయానికి వస్తే, అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. సీడెడ్‌లో రూ.5.6 కోట్ల షేర్‌తో వసూళ్లను నమోదు చేసింది. ఉత్తరాంధ్రలో రూ.3.89 కోట్లు, గుంటూరులో 1.94 కోట్లు, కృష్ణా రూ.2.01 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.74 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 2.1 కోట్లు, నెల్లూరు రూ.1.07 కోట్ల షేర్ వసూలు చేసింది.

     ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

    ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ.31.92 కోట్ల షేర్, రూ.54.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.2 కోట్ల గ్రాస్, రూ.4.45 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఓవర్సీస్‌లో సుమారు రూ.1 కోటి, గ్రాస్ రూ.2.15 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ.34.89 కోట్ల గ్రాస్, రూ.61.1 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయడంతో 202 శాతం లాభాలను రాబట్టింది.

    English summary
    iSmart Shankar directed and produced by Puri Jagannadh and Charmme Kaur. It stars Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh and Satyadev Kancharana, with music composed by Mani Sharma. The film is scheduled for release on 18 July 2019. This movie collects 61 crores gross.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X