తమిళ 'ఈగ' కలెక్షన్స్ ప్రస్తుత పరిస్ధితి
చెన్నై: రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' తమింళంలో 'నాన్ ఈ' టైటిల్ తో విడుదల అయిన సంగతి తెలిసిందే. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా వారు రైట్స్ తీసుకున్నారు. అక్కడ ఈ చిత్రం మూడో వారానికి కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. 200 స్క్రీన్స్ తో విడుదలైన ఈ చిత్రం నాలుగోవారానికి కూడా 180 స్క్రీన్స్ లో రన్ అవుతోంది. చెన్నైలోని సంగం,అబిమాని,సత్యం మల్టిఫెక్స్ లలో ఆడుతోంది.
తమిళ వెర్షన్ నిర్మాత ప్రసాద్ పొత్తూరి మాట్లాడుతూ...హాలీవుడ్ స్థాయికి దీటుగా గ్రాఫిక్స్ సన్నివేశాలను 'నాన్ ఈ' కోసం రూపొందించారు. ఈ చిత్రానికి యూఎస్‌ఏ, రష్యా, పోలెండ్ దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు పని చేయడం విశేషం. ప్రేమ, ప్రతీకారం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సంపాదిస్తోంది. చిన్న,పెద్ద తేడాలేకుండా అందరినీ అలరింస్తూ ఈ చిత్రం ముందుకు వెళితోంది.
సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించింది. తెలుగు వెర్షన్ కి సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.


Click it and Unblock the Notifications











