Itlu Maredumilli Prajaneekam: 4 కోట్ల టార్గెట్.. వారంలో ఘోరంగా.. అదే జరిగితే నరేష్‌కు ఫ్లాపే!

కామెడీ హీరోగా కెరీర్‌ను ప్రారంభించి.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటాడు అల్లరి నరేష్. సుదీర్ఘ కాలం పాటు హాస్యభరిత చిత్రాలనే చేసుకుంటూ వచ్చిన అతడు.. ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని ప్రయోగాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సీరియస్ స్టోరీలతో మూవీస్ చేస్తున్నాడు. ఇలా ఇటీవలే నరేష్ 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆశించిన రీతిలో రెస్పాన్స్ రావట్లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ వారం రోజుల రిపోర్టు మీకోసం!

ఎలక్షన్ ఆఫీసర్‌గా నరేష్ రాక

ఎలక్షన్ ఆఫీసర్‌గా నరేష్ రాక


అల్లరి నరేష్ నటించిన తాజా సినిమానే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ తెరకెక్కించిన ఈ మూవీని హస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ నిర్మించారు. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. అలాగే ఈ సినిమాలో ప్రవీణ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ తదితరులు కీలకమైన పాత్రలను పోషించారు. శ్రీచరణ్ పాకాల ఈ మూవీకి సంగీతం ఇచ్చారు.

నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్

నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అల్లరి నరేష్‌కు మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను అన్ని ఏరియాల్లో అత్యధిక థియేటర్లలో తీసుకు వచ్చారు.

7వ రోజు ఎంత వచ్చిందంటే?

7వ రోజు ఎంత వచ్చిందంటే?


'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి కలెక్షన్లు డల్‌గా ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 90 లక్షలు గ్రాస్, 2వ రోజు రూ. 81 లక్షలు గ్రాస్, 3వ రోజు రూ. 70 లక్షలు, 4వ రోజు రూ. 30 లక్షలు గ్రాస్‌, 5వ రోజు రూ. 18 లక్షలు గ్రాస్‌, 6వ రోజు రూ. 16 లక్షలు గ్రాస్‌ మాత్రమే వచ్చింది. ఇక, ఏడో రోజు ఇంకాస్త తగ్గి రూ. 15 లక్షలు గ్రాస్‌, రూ. 8 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

7 రోజులకూ ఎంత వచ్చింది?

7 రోజులకూ ఎంత వచ్చింది?

అల్లరి నరేష్ నటించిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ఆంధ్రా, తెలంగాణలో వారం రోజుల్లో చాలా తక్కువ వసూళ్లను మాత్రమే కలెక్ట్ చేసింది. ఏరియాల పరంగా చూస్తే.. 7 రోజుల్లో ఇది నైజాంలో రూ. 1.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 32 లక్షలు, ఆంధ్రాలో రూ. 1.63 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 7 రోజుల్లో ఈ మూవీ రూ. 3.21 కోట్లు గ్రాస్, రూ. 1.69 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 3.21 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 20 లక్షలు వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో రూ. 3.41 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.80 కోట్లు షేర్‌ మాత్రమే వచ్చింది.

టార్గెట్‌కు ఇంకెంత రావాలి?

టార్గెట్‌కు ఇంకెంత రావాలి?

అల్లరి నరేష్ నటించిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లో రూ. 1.80 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.20 కోట్లు షేర్‌ను రాబడితేనే ఇది హిట్ అవుతుంది.

అదే జరిగితే నరేష్‌కు ఫ్లాపే

అదే జరిగితే నరేష్‌కు ఫ్లాపే


టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ గత ఏడాది 'నాంది'తో భారీ విజయాన్ని అందుకున్నాడు. కానీ, ఇప్పుడు వచ్చిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టడం లేదు. ఫలితంగా వారంలో ఇది కేవలం 35 శాతం వసూళ్లనే రాబట్టింది. రెండో వారంలోనూ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ చిత్రం ఫ్లాప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X