Itlu Maredumilli Prajaneekam: టాక్ ఒకలా వసూళ్లు మరోలా.. 2 రోజుల్లో ఇంతే.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్నాడు అల్లరి నరేష్. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో పంథాను మార్చుకుని సీరియస్ సినిమాలు చేస్తోన్న నరేష్.. ఇప్పుడు 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా వసూళ్లు పెద్దగా రావట్లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రెండు రోజుల రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

ఎలక్షన్ ఆఫీసర్‌గా అల్లరి నరేష్

ఎలక్షన్ ఆఫీసర్‌గా అల్లరి నరేష్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రమే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ తెరకెక్కించిన ఈ మూవీని హస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ నిర్మించారు. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు. ఇందులో ప్రవీణ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ సహా పలువురు కీలక పాత్రలు చేశారు.

నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్

నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్

తెలుగు రాష్ట్రాల్లో అల్లరి నరేష్‌కు మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను అన్ని ఏరియాల్లోనూ ఎక్కువ థియేటర్లలో విడుదల చేసుకున్నారు.

2వ రోజు ఎంత వచ్చిందంటే?

2వ రోజు ఎంత వచ్చిందంటే?

నరేష్ నటించిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అనుకన్న దానికంటే తక్కువ మొత్తమే వచ్చింది. అయితే, రెండో రోజు ఈ సినిమా చక్కగా హోల్డ్ చేసింది. ఇలా మొదటి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 90 లక్షలు గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 81 లక్షలు గ్రాస్‌ను సొంతం చేసుకుంది. దీంతో రూ. 40 లక్షలు షేర్ రాబట్టింది.

2 రోజులకూ ఎంత వచ్చింది?

2 రోజులకూ ఎంత వచ్చింది?

అల్లరి నరేష్ నటించిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ రెండు రోజులకూ కలిసి ఆంధ్రా, తెలంగాణలో పర్వాలేదనిపించే వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఏరియాల పరంగా చూస్తే.. ఇది నైజాంలో రూ. 65 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 90 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 2 రోజుల్లో ఈ మూవీ రూ. 1.71 కోట్లు గ్రాస్, రూ. 93 లక్షలు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 1.71 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లు లేని కారణంగా పెద్దగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 10 లక్షలు వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 1.82 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 97 లక్షలు షేర్‌ను వచ్చింది.

 టార్గెట్‌కు ఇంకెంత రావాలి?

టార్గెట్‌కు ఇంకెంత రావాలి?

నరేష్ 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 రోజుల్లో రూ. 97 లక్షలు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.03 కోట్లు షేర్‌ను రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X