Itlu Maredumilli Prajaneekam: నరేష్‌కు దెబ్బ మీద దెబ్బ.. అన్ని కోట్లు వస్తేనే హిట్.. కానీ!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది ప్రముఖులు పిల్లలు హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవడంతో పాటు వరుస చిత్రాలతో సందడి చేస్తోన్నారు. అలాంటి వారిలో అల్లరి నరేష్ ఒకడు. బడా డైరెక్టర్ కుమారుడిగా వచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును, మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఈ ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే నరేష్ ఇప్పుడు 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాతో వచ్చాడు. ఈ సినిమా 6 రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి మరి!

మారేడుమిల్లికి వచ్చిన నరేష్
టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన సందేశాత్మక చిత్రమే 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ తెరకెక్కించిన ఈ మూవీని హస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ నిర్మించారు. ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. ఇందులో ప్రవీణ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు.

నరేష్ మూవీ బిజినెస్ డీటేల్స్
అల్లరి నరేష్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను అన్ని ఏరియాల్లో అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

6వ రోజు ఎంత వచ్చిందంటే?
అల్లరి నరేష్ 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి టాక్‌కు అనుగుణంగా కలెక్షన్లు రావట్లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 90 లక్షలు గ్రాస్, 2వ రోజు రూ. 81 లక్షలు గ్రాస్, 3వ రోజు రూ. 70 లక్షలు, 4వ రోజు రూ. 30 లక్షలు గ్రాస్, 5వ రోజు రూ. 18 లక్షలు గ్రాస్‌ను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక, ఆరో రోజు ఘోరంగా రూ. 15 లక్షలు గ్రాస్, రూ. 8 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది.

6 రోజులకూ ఎంత వచ్చింది?
అల్లరి నరేష్ నటించిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ఆంధ్రా, తెలంగాణలో ఆరు రోజుల్లో చాలా తక్కువ వసూళ్లను మాత్రమే కలెక్ట్ చేసింది. ఏరియాల పరంగా చూస్తే.. 6 రోజుల్లో ఇది నైజాంలో రూ. 1.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 29 లక్షలు, ఆంధ్రా మొత్తంలో రూ. 1.54 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా 6 రోజుల్లో ఈ మూవీ రూ. 3.03 కోట్లు గ్రాస్, రూ. 1.59 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
ఆరు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 3.03 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ ప్రపంచ వ్యాప్తంగా కూడా నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 18 లక్షలు వచ్చాయి. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 3.21 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.69 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది.

టార్గెట్‌కు ఇంకెంత రావాలి?
అల్లరి నరేష్ 'ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 రోజుల్లో రూ. 1.69 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 2.31 కోట్లు షేర్‌ను రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











