ఇది అనూష్క వీక్ (ట్రేడ్ టాక్)

ఇక అష్టాచెమ్మ ఆ దర్శకుడు తోనే అదే నిర్మాత సినిమా మళ్ళీ ప్లాన్ చేసేంత హిట్టయి టాప్ చెయిర్ లోనే కొనసాగుతోంది. చెప్పుకోతగ్గ స్టార్ కాస్టింగ్ లేకుండా కేవలం స్క్రిప్టు బలంతో ఆడుతున్న ఈ చిత్రం మరిన్ని ఇలాంటి చిత్రాలకు ప్రేరణ ఇస్తుందనటంలో సందేహం లేదు. అలాగే రక్ష బి,సి సెంటర్లలకు తరలి వెళ్ళి అక్కడా చెప్పుకోతగ్గ కలెక్షన్స్ తేకపోయినా శాటిలైట్ రైట్స్ ,ఓపినింగ్స్ తెచ్చుకుని తన బడ్జెట్ కి న్యాయం చేసుకుని ఆ దర్శకుడికి తెలగు పరిశ్రమలో డిమాండ్ తెచ్చిపెట్టింది.
గుండెఝల్లుమంది, మల్లెపూవు చిత్రాలు పూర్తి స్ధాయి ప్లాప్ టాక్ తెచ్చుకోవటంతో డి.వి.డిలు రిలీజయ్యాక రిలీజయ్యాక చూద్దాంలే అని జనం ప్రిపేర్ అయ్యారు. నిన్న రిలీజైన కొత్త బంగారులోకం యూత్ ని ప్రవాహంలా రప్పించుకుంటోది కానీ ఇంప్రెస్ చేయటంలో విఫలమవుతోందని వినికిడి. కౌసల్యా సుప్రజా రామా(శ్రీకాంత్ ,ఛార్మీ,గౌరీముంజిల్) సినిమా ఫరవాలేదు..నాట్ సొ బ్యాడ్ అనే టాక్ తెచ్చుకుంది. అయితే చూసిన వాళ్ళు పెద్దగా లేక పోవటంతో పెద్దగా మౌత్ టాక్ పుట్టడం లేదు.


Click it and Unblock the Notifications











