For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జానుకి ఫీల్ గుడ్ టాక్.. కానీ పీకల్లోతు కలెక్షన్ల కష్టాలు.. ఇంకా నష్టాల్లోనే..

    |

    తమిళంలో ఘన విజయం సాధించిన 96 మూవీ ఆధారంగా రూపొందించిన జాను చిత్రం పాజిటివ్‌ టాక్‌ను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలోకి మరల్చుకోవడం లేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. సమంత, శర్వానంద్ తెరపైన చేసిన మ్యాజిక్‌ వసూళ్ల రూపంలోకి మారడంలో ఎంత సక్సెస్ అయ్యిందనే విషయంలోకి వెళ్లే.. గత ఏడు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

    బ్రహ్మండమైన ప్రీ రిలీజ్ బిజినెస్ తర్వాత రూ.19 కోట్ల టార్గెట్‌తో జాను బాక్సాఫీస్ రేసు మొదలైంది. అయితే తొలి వారాంతంలో ఈ చిత్రం సాధించిన వసూళ్లు నిలకడగా ఉండలేకపోయాయి. ఏడో రోజున జాను చిత్రం నైజాంలో రూ.5 లక్షలు, సీడెడ్‌లో రూ.1 లక్ష, ఉత్తరాంధ్రలో రూ.1.6 లక్షలు, తూర్పు గోదావరిలో రూ.7 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5 లక్షలు, గుంటూరులో రూ.6 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.3 లక్షలు, నెల్లూరులో రూ.3 లక్షలు సాధించింది.

    Jaanu world wide day 7 collections: Sharwanand, Samantha Akkineni steal the show.

    ఇక గత వారం రోజుల కలెక్షన్లను పరిశీలిస్తే.. నైజాంలో ఈ చిత్రం రూ.2.68 కోట్లు, సీడెడ్‌లో రూ.84 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.1.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.45 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ.34 లక్షలు, గుంటూరులో రూ56 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.46 లక్షలు, నెల్లూరులో రూ.21 లక్షలు సాధించింది. ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల్లో కలిపితే 1.2 కోట్లు వసూలు చేసింది. గత 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జాను చిత్రం రూ.7.92 కోట్లు (రూ.14.16 కోట్ల గ్రాస్‌)ను రాబట్టింది.

    ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే రూ.18 కోట్లకుపైగానే జరిగింది. ఇంకా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.10 కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది.

    English summary
    Jaanu movie world wide day 7 collections: Sharwanand, Samantha Akkineni steal the show but movie is not impressive at box office. Still this movie, Struggling to get the numbers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X