Jaat Collections: జాట్ బాక్సాఫీస్ కలెక్షన్లు.. గదర్ 2 రికార్డుకు దూరంగా సన్నీ మూవీ.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీడియోల్ నటించిన జాట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తొలిసారి హిందీ రంగంలోకి ప్రవేశిస్తూ రూపొందించిన ఈ సినిమాకు తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. పూర్తిస్థాయి హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత అనే వివరాల్లోకి వెళితే...
జాట్ చిత్రం కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్, మసాలా అంశాలు రంగరించి ఈ సినిమాను రూపొందించారు. సన్నీడియోల్ కెరీర్‌లో ఘాయల్, ఘాతక్, నరసింహ లాంటి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమాలను మరిపించే విధంగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించారు. ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలు ఇప్పటికే ఆడియెన్స్‌లో అంచనాలు పెంచాయి.

హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో సన్నీడియోల్‌తోపాటు రెజీనా కసండ్రా, సయామీ ఖేర్, రమ్యకృష్ణన్, జగపతి బాబు, బబ్లూ పృథ్వీరాజ్, జరీనా వాహెబ్, ఉపేంద్ర లిమియే,అజయ్ ఘోష్, ఆయేషా ఖాన్, దయానంద్ రెడ్డి, ఊర్వశీ రౌటేలా అతిథి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు.
గదర్ 2 లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత సన్నీడియోల్ జాట్ సినిమాతో వస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను సుమారుగా 100 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 100 కోట్ల షేర్.. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
జాట్ సినిమాను గురువారం మహావీర్ జయంతి సెలవును దృష్టిలో పెట్టుకొని..లాంగ్ వీకెండ్‌లో భారీ కలెక్షన్లు సాధించాలనే ప్లాన్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు ఊహించినంతగా స్పందన కనిపించలేదు. దాంతో బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు స్పందించే తీరును బట్టి ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
సన్నీడియోల్ రీ ఎంట్రీతో వచ్చిన చిత్రం గదర్ 2. ఈ సినిమా తొలి రోజున సుమారుగా 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా తొలి రోజున 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉంటే.. ఈ నంబర్లు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











