Jaat 12 days Collection: 100 కోట్లు దాటేసిన జాట్ మూవీ.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
గద్దర్ 2 మాసివ్ హిట్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ నటించిన జాట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ వసూళ్లను రాబడుతున్నది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించారు. తొలిసారి హిందీ రంగంలోకి ప్రవేశిస్తూ రూపొందించిన ఈ సినిమాకు తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని.
పూర్తిస్థాయి థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో రణ్‌దీప్ హుడా రెజీనా కసండ్రా, సయామీ ఖేర్, రమ్యకృష్ణన్, జగపతి బాబు, బబ్లూ పృథ్వీరాజ్, జరీనా వాహెబ్, ఉపేంద్ర లిమియే,అజయ్ ఘోష్, ఆయేషా ఖాన్, దయానంద్ రెడ్డి, ఊర్వశీ రౌటేలా అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత అనే వివరాల్లోకి వెళితే...

జాట్ మూవీని ఖర్చుకు వెనుకాడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 100 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా సొంతంగా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 100 కోట్ల షేర్.. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఓటీటీ, శాటిలైట్ రూపంలో భారీగా రెవెన్యూను రాబట్టింది. ఈ క్రమంలో థియేట్రికల్ రన్‌లో ఏ మేరకు లాభం వస్తుందనే విషయంపై ట్రేడ్ వర్గాలు దృష్టిపెట్టాయి.
గద్దర్ 2 సినిమాతో పోల్చుకొంటే జాట్ తక్కువగానే కలెక్షన్లు రాబట్టింది. కానీ నిలకడగా, స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కనిపించింది. తొలి రోజు 10 కోట్ల రూపాయల ఇండియన్ కలెక్షన్లతో జర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత రెండో రోజు 7 కోట్లు, మూడో రోజు 10 కోట్లు, నాలుగో రోజు 14 కోట్లు వసూలు చేసింది. తొలివారాంతంలో ఈ సినిమా 41 కోట్ల రూపాయలు వసూలు చేసి 50 కోట్లకు చేరువైంది.
తొలివారాంతం తర్వాత సన్నీడియోల్ హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగింది. 5వ రోజు 7.5 కోట్లు, 6వ రోజు 6 కోట్లు వసూలు చేసింది. ఇక 7వ రోజు 4 కోట్లు, 8వ రోజు 4.5 కోట్ల వసూలు నమోదు చేసింది. దాంతో ఈ సినిమా తొలివారం ముగిసే సమయానికి 62 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. రెండోవారం తర్వాత కూడా ఇండియాలో ఈ సినిమా స్టడీగా కలెక్షన్లే సాధించడంతో 76 కోట్లు నెట్, 90 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని సాక్ నిల్క్ వెల్లడించింది.
జాట్ సినిమా ఓవర్సీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఓ మాదిరి కలెక్షన్లతో ఈ సినిమా సరిపెట్టుకొన్నది. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో 1.5 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది. ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుండటంతో లైఫ్ టైమ్‌లో 150 కోట్ల రూపాయల వద్ద క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











