6 రోజుల్లో 122 కోట్లు కలెక్షన్-ప్రకటించిన నిర్మాతలు
ముంబై: బాలీవుడ్ మూవీ 'జబ్ తక్ హై జాన్' చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. దివంగత ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా యొక్క లాస్ట్ డైరెక్షనల్ వెంచ్ 'జబ్ తక్ హై జాన్' చిత్రం ఇండియా బాక్సాఫీసు వద్ద టాప్ గేర్ లో దూసుకెలుతోంది. షారుక్, కత్రినా జంటగా నటించిన ఈచిత్రం కేవలం 6 రోజుల్లో రూ. 50 కోట్లు కలెక్షన్ సాధించింది. జబ్ తక్ హై జాన్ చిత్రం నవంబర్ 13న దీపావళి సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2,500 పై చిలుకు స్క్రీన్లలో విడుదలైంది. ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీసు వద్ద మరింత పుంజుకుంది.
ఇండియాలో కలెక్షన్ల వివరాలు
13/11/2012 మంగళవారం 15.23 కోట్లు
14/11/2012 బుధవారం 19.54 కోట్లు
15/11/2012 గురువారం 14.45 కోట్లు
16/11/2012 శుక్రవారం 11.17 కోట్లు
17/11/2012 శనివారం 10.38 కోట్లు
18/11/2012 ఆదివారం 9.96 కోట్లు
మొత్తం ఇండియా కలెక్షన్: రూ. 80.73 కోట్లు
ఓవర్సీస్ లో కలెక్షన్ల వివరాలు
13/11/2012 మంగళవారం $1.30 మిలియన్
14/11/2012 బుధవారం $1.20 మిలియన్
15/11/2012 గురువారం $1.08 మిలియన్
16/11/2012 శుక్రవారం $1.35 మిలియన్
17/11/2012 శనివారం $1.52 మిలియన్
18/11/2012 ఆదివారం $1.13 మిలియన్
ఓవర్సీస్ టోటల్ కలెక్షన్ $ 7.5 మిలియన్(రూ.41.7 కోట్లు), బాలీవుడ్ చరిత్రలో ఈ రేంజిలో కలెక్షన్ రావడం ఇదే తెలిసారి.


Click it and Unblock the Notifications











