మూడు రోజుల్లో 50 కోట్లతో బాద్‌షా తడాఖా!
ముంబై : స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాలో భాగమైతే చాలు....ఓపెనింగ్స్ భారీ గా వస్తాయి. ఇక బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సినిమాలకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా బాలీవుడ్ మూవీ 'జబ్ తక్ హై జాన్' చిత్రం విషయంలో అదే జరిగింది. దివంగత ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా యొక్క లాస్ట్ డైరెక్షనల్ వెంచ్ 'జబ్ తక్ హై జాన్' చిత్రం ఇండియా బాక్సాఫీసు వద్ద టాప్ లో నిలిచింది. సన్ ఆప్ సర్దార్ చిత్రం కాంపిటీషన్ ఉన్నప్పటికీ....షారుక్, కత్రినా జంటగా నటించిన ఈచిత్రం మూడు రోజుల్లో రూ. 50 కోట్లు కలెక్షన్ సాధించింది.
జబ్ తక్ హై జాన్ చిత్రం నవంబర్ 13న దీపావళి సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2,500 పై చిలుకు స్క్రీన్లలో విడుదలైంది. ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీసు వద్ద మరింత పుంజుకుంది. విడుదలైన అన్ని చోట్ల కూడా థియేటర్లు కిటకిటలాడుతున్నారు. 90 శాతం నుంచి 100 శాతం ఆక్సుపెన్సీతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ చిత్రం తొలి రోజు రూ. 15. 23 కోట్ల వసూళ్లు సాధించింది. షారుక్ గత చిత్రం రా.వన్ తో పోలిస్తే ఈ కలెక్షన్లు చాలా తక్కువ. రా.వన్ చిత్రం తొలి రోజు రూ. 19.54 కోట్లు సాధించింది. పండగ రోజు కావడమే కలెక్షన్లు తగ్గడానికి కారణం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే తర్వాతి రెండు రోజులు సినిమా కలెక్షన్ పుంజుకుంది. తొలి మూడు రోజుల్లో 'బబ్ తక్ హై జాన్' చిత్రం రూ. 50.77 కోట్లు వసూలు చేసింది. అయితే షారుక్ గత చిత్రం రా.వన్(రూ.57 కోట్లు)తో పోలిస్తే ఈ కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











