Jack Day 1 Collections : టఫ్ ఫైట్‌లో సిద్ధూ కలెక్షన్ల వేట .. జాక్ మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?
సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం జాక్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. జాక్ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే :

జాక్ బడ్జెట్ బడ్జెట్ ఎంత (Jack Budget)?
జాక్‌లో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించగా.. అచ్చు రాజమణి, సామ్ సీఎస్, సురేష్ బొబ్బిలి సంగీత సారథ్యం వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి జాక్ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రూ.130 కోట్ల టిల్లు స్క్వేర్ చిత్రం తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తుండటంతో ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ టాక్ ప్రకారం ఒక్క సిద్దు జొన్నలగడ్డ పారితోషికం కింద రూ.10 కోట్లు అందుకున్నారట.
జాక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Jack Break Even Target)?
చిన్న సినిమా అయినప్పటికీ జాక్‌కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటొచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. జాక్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.18 కోట్ల షేర్.. రూ.36 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
జాక్ కలెక్షన్లు (Jack Collections)
జాక్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. టీజర్ , ట్రైలర్లు, పాటలు, సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్ కూడా బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజుకే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.1.30 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా చెబుతున్నారు. మార్నింగ్ షో నుంచి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ కారణంగా ఈ సినిమాకు మంచి ఆక్యూపెన్సీ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు జాక్ చిత్రానికి ఓవరాల్‌గా 25.99 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ తెలిపింది. హైదరాబాద్‌లో 440, బెంగళూరులో 204 , విజయవాడలో 84, విశాఖలో 117 షోలు పడినట్లుగా వెల్లడించింది.
జాక్ తొలి రోజు కలెక్షన్స్ అంచనా ( Jack Day 1 Expected Collections)
సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్యలకు యువతలో ఉన్న క్రేజ్ దృష్ట్యా రాత్రి వరకు జాక్ సినిమాకు మంచి బుకింగ్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఇది రూ.6 కోట్ల పైనే ఉంటుందని భావిస్తున్నారు. చూద్దాం మరి సిద్ధూ జొన్నలగడ్డ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేస్తాడో?


Click it and Unblock the Notifications











