Jack Day 1 Box Office : టిల్లూ స్క్వేర్‌ను కొట్టలేకపోయిన సిద్దూ .. జాక్‌కి షాకింగ్ ఓపెనింగ్స్, ఎన్ని కోట్లంటే?

టిల్లూ స్క్వేర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ నటించిన చిత్రం జాక్. అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ కాగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. జాక్ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే..

Jack Day 1 Collections Worldwide siddhu jonnalagadda s Movie bags poor openings

జాక్ బడ్జెట్ బడ్జెట్ ఎంత (Jack Budget)?

జాక్‌లో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించగా.. అచ్చు రాజమణి, సామ్ సీఎస్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి జాక్ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

జాక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Jack Break Even Target)?

చిన్న సినిమా అయినప్పటికీ జాక్‌కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటొచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. జాక్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.18 కోట్ల షేర్.. రూ.36 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

జాక్ కలెక్షన్లు (Jack Collections)

జాక్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్, వైష్ణవి చైతన్య హీరోయిన్ కావడం పైగా చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండటంతో జాక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజ్‌తో సిద్ధూ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ బాగానే జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ.1.30 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా అంచనా.

జాక్ తొలి రోజు కలెక్షన్స్ అంచనా ( Jack Day 1 Collections)

జాక్ తొలి రోజు ఓవరాల్‌గా 24.14 శాతం థియేటర్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. మ్యాట్నీ, సెకండ్ షోలకు మంచి బుకింగ్స్ జరిగినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో 443 షోలు, బెంగళూరులో 204 షోలు, విజయవాడలో 93 షోలు, విశాఖలో 119 షోలు పడగా.. ఓవరాల్ ఆక్యూపెన్సీలో చెన్నై (44 శాతం) టాప్‌లో నిలవడం విశేషం. జాక్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్ల నికర వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది.

జాక్‌పై ఉన్న అంచనాలు, క్రేజ్‌కు.. వచ్చిన ఈ ఓపెనింగ్స్ నిరాశపరిచినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సిద్ధూ జొన్నలగడ్డ గత చిత్రం టిల్లూ స్వ్కేర్ తొలి రోజు బాక్సాఫీస్‌ను గడగడలాడించింది. ఈ సినిమా తొలిరోజున ఏకంగా రూ.23 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. టిల్లూ స్క్వేర్‌ తొలిరోజు ఏపీ, తెలంగాణలలో రూ.13.45 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.9.28 కోట్ల గ్రాస్ , రెస్టాఫ్ ఇండియాలో రూ.96 లక్షలు చొప్పున వసూలు చేసింది. టిల్లూ స్క్వేర్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన జాక్ ఫస్ట్ డే రికార్డ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ తొలిరోజు నిరాశపరచడంతో సిద్ధూ అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో జాక్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X