Jack Day 2 Collections : సిద్ధూ జొన్నలగడ్డకు షాక్ .. రెండో రోజూ దారుణంగా, జాక్‌కు ఎన్ని కోట్లంటే?
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ , వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం జాక్. వేసవి కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. జాక్ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే..

జాక్ బడ్జెట్ బడ్జెట్ ఎంత (Jack Budget)?
జాక్‌లో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించగా.. అచ్చు రాజమణి, సామ్ సీఎస్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి జాక్ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
జాక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Jack Break Even Target)?
చిన్న సినిమా అయినప్పటికీ జాక్‌కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటొచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. జాక్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.18 కోట్ల షేర్.. రూ.36 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
జాక్ తొలిరోజు కలెక్షన్లు (Jack Day 1 Collections)
జాక్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ.1.30 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా అంచనా. దీంతో తొలిరోజు జాక్ ఏ రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబడుతుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫస్ట్ డే భారత్‌లో నికరంగా కేవలం రూ.2.5 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టి నిరాశ పరిచింది. టిల్లూ స్క్వేర్‌కు మించి వసూళ్ల వర్షం కురిపిస్తుందని అనుకుంటే దారుణమైన రిజల్ట్ రావడంతో సిద్ధూ అభిమానులు షాక్ అవుతున్నారు. కోవిడ్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ చిత్రాల్లో తక్కువ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా జాక్ నిలిచింది. డీజ టిల్లు తొలి రోజు 5.30 కోట్ల రూపాయలు, టిల్లు స్క్వేర్ రూ.11.70 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టాయి.
జాక్ రెండో రోజు వసూళ్లు ( Jack Day 2 Collections)
ఇక రెండో రోజు జాక్ వసూళ్ల విషయానికి వస్తే.. శుక్రవారం బుకింగ్స్ భారీగా పడిపోయాయి. ఓవరాల్‌గా 14.57 శాతం ఆక్యూపెన్సీ మాత్రమే నమోదైంది. హైదరాబాద్‌లో 433, బెంగళూరులో 186, విజయవాడలో 80, విశాఖలో 104 షోలు ప్రదర్శితమయ్యాయి. మొత్తంగా రెండో రోజు ఇండియా వైడ్‌గా రూ.83 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టిన జాక్ మరో బాంబు పేల్చింది.
వీకెండ్, వరుస సెలవులు ఉన్నప్పటికీ కలెక్షన్స్ పుంజుకోలేకపోవడం చిత్ర యూనిట్‌ను నిరాశపరిచింది. శని, ఆదివారాలలో వచ్చే వసూళ్లపైనే జాక్ యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వీకెండ్ తర్వాత ఈ సినిమా భవితవ్యం తేలిపోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి సిద్ధూ జొన్నలగడ్డ ఎలాంటి మేజిక్ చేస్తాడో?


Click it and Unblock the Notifications











