Jack Day 3 Collections : జాక్‌కు భారీ దెబ్బ .. డిజాస్టర్ దిశగా , మూడో రోజు ఎన్ని కోట్లంటే?

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ , వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం జాక్. ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టిల్లూ స్క్వేర్ బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధూ చేస్తున్న సినిమా కావడం పైగా వైష్ణవి చైతన్యం హీరోయిన్‌ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. జాక్ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే..

Jack Day 3 Collections Worldwide siddhu jonnalagadda s Movie disappoints 3rd day

జాక్ బడ్జెట్ బడ్జెట్ ఎంత (Jack Budget)?

జాక్‌లో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించగా.. అచ్చు రాజమణి, సామ్ సీఎస్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి జాక్ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

జాక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Jack Break Even Target)?

చిన్న సినిమా అయినప్పటికీ జాక్‌కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటొచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. జాక్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.18 కోట్ల షేర్.. రూ.36 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

జాక్ రెండు రోజుల కలెక్షన్లు (Jack 2 Days Collections)

జాక్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ.1.30 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా అంచనా. తొలి రోజు ఈ సినిమాకు రూ. 2.5 కోట్ల నెట్ , రెండో రోజు రూ.1.01 కోట్ల నెట్ చొప్పున రెండు రోజుల వరకు సిద్దూ జొన్నలగడ్డ చిత్రం భారత్‌లో నికరంగా రూ.3.60 కోట్లు రాబట్టింది.

జాక్ మూడో రోజు వసూళ్లు ( Jack Day 3 Collections)

ఇక మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. శనివారం ఓవరాల్‌గా 16.10 శాతం చొప్పున థియేటర్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్ నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. హైదరాబాద్‌లో 417 షోలు, బెంగళూరులో 157 షోలు, విజయవాడలో 86 షోలు, విశాఖపట్నంలో 106 షోలు పడ్డాయి. మూడో రోజున జాక్ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.92 కోట్ల నెట్ రాబట్టింది. దీంతో మూడు రోజుల వరకు సిద్ధూ జొన్నలగడ్డ మూవీ నికరంగా రూ.4.45 కోట్లు ఆర్జించింది.

ఆదివారంతో వీకెండ్ ముగుస్తుండటంతో జాక్ సినిమా రిజల్ట్ మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. సిద్దూ జొన్నలగడ్డ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.13 కోట్లు రాబట్టాల్సి ఉంది. మరి జాక్ తన లాంగ్‌ రన్‌లో ఎంత మేరకు రికవరీ చేస్తాడో చూడాలి. ఆదివారం తర్వాత వర్కింగ్ డేస్ ప్రారంభం కానుండటం, వచ్చే వారం కొత్త సినిమాలు వస్తుండటంతో జాక్ సినిమా వసూళ్లపై ఇండస్ట్రీలో ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X