Jack Day 4 Collections : షాకిచ్చిన సండే .. దారుణంగా జాక్ కలెక్షన్స్, వైష్ణవి చైతన్య మూవీకి ఎన్ని కోట్లంటే?
టిల్లూ స్వ్కేర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యువ హీరో సిద్దూ జొన్నలగొడ్డ నటించిన చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. జాక్ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే..
జాక్ బడ్జెట్ బడ్జెట్ ఎంత (Jack Budget)?
జాక్‌లో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీలు కీలకపాత్రలు పోషించగా.. అచ్చు రాజమణి, సామ్ సీఎస్, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి జాక్ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

జాక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Jack Break Even Target)?
చిన్న సినిమా అయినప్పటికీ జాక్‌కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటొచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. జాక్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.18 కోట్ల షేర్.. రూ.36 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
జాక్ మూడు రోజుల కలెక్షన్లు (Jack 3 Days Collections)
జాక్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ.1.30 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా అంచనా. తొలి రోజు ఈ సినిమాకు రూ. 2.5 కోట్ల నెట్ , రెండో రోజు రూ.1.01 కోట్ల నెట్, మూడో రోజున 1.10 కోట్ల రూపాయల నెట్ రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల వరకు జాక్ సినిమా నికరంగా రూ.4.60 కోట్లు ఆర్జించినట్లు సాక్ నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది.
జాక్ నాలుగో రోజు వసూళ్లు ( Jack Day 4 Collections)
ఇక నాలుగో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఆదివారం వీకెండ్ అయినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో బుకింగ్స్ జరగలేదని గణాంకాలు చెబుతున్నాయి. నాలుగో రోజు ఓవరాల్‌గా 16.19 శాతం చొప్పున థియేటర్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్ నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. హైదరాబాద్‌లో 396 షోలు, బెంగళూరులో 127 షోలు, విజయవాడలో 81 షోలు, విశాఖపట్నంలో 98 షోలు పడ్డాయి. నాలుగో రోజున జాక్ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.91 లక్షల నెట్ రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల వరకు సిద్ధూ జొన్నలగడ్డ మూవీ నికరంగా రూ.5.55 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ పేర్కొంది.
భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ డివైడ్ టాక్ కారణంగా జాక్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. వీకెండ్, వరుస సెలవులను కూడా క్యాష్ చేసుకోలేక ఈ సినిమా చతికిలపడింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.12 కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడొస్తున్న గణాంకాలను బట్టి చూస్తే జాక్ చిత్రం ఏ మేరకు నిలబడుతుందో చూడాలి? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతుందా? మధ్యలోనే చేతులు ఎత్తేస్తుందా? అనేది మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











