‘పటాస్‌’నుంచి ఆ డైలాగు లేపేసిన సెన్సార్

By Srikanya

హైదరాబాద్: నందమూరి కళ్యాణ్‌రామ్‌ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘పటాస్‌'. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ' సర్టిఫికేట్‌ అందుకుంది. ఈ చిత్రం డైలాగుల్లో ‘లగడపాటి రాజగోపాల్, ధాంక్స్ ఫర్ యువర్ పెప్పర్ స్ప్రే' అనే డైలాగు ఉంది. ట్రైలర్స్ లో అది మీరు చూసే ఉంటారు. పోసాని చెప్పే ఈ డైలాగుని సెన్సార్ కట్ చేసేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినిమాలో యాక్షన్‌ పాళ్లు ఎక్కువ ఉండటంతో ‘ఎ' సర్టిఫికేట్‌ మంజూరు చేసింది సెన్సార్‌ బోర్డు. 141 నిముుషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి సంబంధించి అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్‌సీస్‌ హక్కులను బ్లూస్కై డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ కైవసం చేసుకుంది. ఈ సినిమాలో సాయికుమార్‌, బ్రహ్మనదంం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, జయ ప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళీ వంటి భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ చిత్రంపై యూనిట్‌ సభ్యులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

‘Jagadapati Ramgopal’’ deleted from Pataas movie

కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ... యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని పాటించే ఓ పోలీస్ ఆఫీసర్‌కు విధినిర్వహణలో భాగంగా సమాజంలోని కొన్ని దుష్టశక్తుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? తన తెలివితేటలతో ఆ సమస్యల్ని అతడు ఏ విధంగా పరిష్కరించాడు?

ఓ మహిళా జర్నలిస్ట్ పరిచయం అతని జీవితంలో ఏవిధమైన మార్పుల్పి తీసుకొచ్చింది? అనేది చిత్ర ప్రధాన ఇతివృత్తం. వినోదానికి పెద్దపీటవేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నా పాత్ర చిత్రణ నవ్యరీతిలో సాగుతుంది. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. కొత్తదనానికి ప్రాధాన్యమిస్తూ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇటీవలే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. త్వరలో ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సాయికార్తీక్ సంగీతం, సర్వేష్ మురారి ఛాయాగ్రహణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మా బ్యానర్ ప్రతిష్టని మరింతగా పెంచే చిత్రమిది.

క్లాస్, మాస్‌తో పాటు అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. సాయికుమార్,బ్రహ్మానందం,అశుతోష్‌రాణా, ఎమ్మెస్‌నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సర్వేష్‌మురారి, ఎడిటింగ్:తమ్మిరాజు, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, రచనా సహకారం:ఎస్.క్రిష్ణ. కథ,మాటలు,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం:అనిల్ రావిపూడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X