twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జగదేక వీరుడు అతిలోక సుందరి కలెక్షన్ల హోరు.. రికార్డుల సంచలనం.. అప్పట్లో ఎంత వసూలంటే..

    |

    మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం సృష్టించిన రికార్డులు టాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలచాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ దృశ్యకావ్యం తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అనేక రికార్డులను క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. అయితే ఈ చిత్రం అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

    Recommended Video

    30 Years Of Jagadeka Veerudu Athiloka Sundari Collections And Records
    8 కోట్ల బడ్జెట్‌తో

    8 కోట్ల బడ్జెట్‌తో

    ప్రముఖ నిర్మాత సీ అశ్వినిదత్ తన సొంత బ్యానర్ వైజయంతీ మూవీస్‌పై జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో ఈ చిత్రానికి బడ్జెట్ రూ.8 కోట్లు. ఇప్పుటి పరిస్థితులతో పోల్చుకొంటే దాదాపు 63 కోట్ల రూపాయలుగా అంచనా వేసుకోవచ్చు. అత్యాధునిక సాంకేతికతతో, గ్రాఫిక్స్‌కు పెద్ద పీటవేశారు. అన్ని విభాగాల్లో హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కించడం జరిగింది.

    రికార్డు స్థాయిలో 100 రోజుల పండుగ

    రికార్డు స్థాయిలో 100 రోజుల పండుగ

    జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రిలీజ్ సమయంలో ఎదురైన ప్రతికూల తుఫాన్ పరిస్థితులను ఎదురించి ప్రేక్షకులను థియేటర్‌కు పరుగులు పెట్టేలా చేసింది. ఈ చిత్రం 47 కేంద్రాల్లో 50 రోజులు, 29 కేంద్రాల్లో 100 రోజులు పండుగను చేసుకొన్నది. అప్పట్లో ఈ రేంజ్‌లో సినిమా ఆడటం ఓ రికార్డుగా సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

    హైదరాబాద్‌లో సెన్సేషన్

    హైదరాబాద్‌లో సెన్సేషన్

    ఇక తెలుగు సినిమా చరిత్రలో హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌ ఓ రికార్డుకు వేదికగా మారింది. ఈ చిత్రం 100 రోజులకు 30లక్షలకుపైగా రాబట్టింది. అలాగే 162 రోజులకు ఈ చిత్రం రూ.40 లక్షల గ్రాస్ వసూలు చేయడం నైజాం ఏరియాలో ఓ సింగిల్ థియేటర్‌ అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.

    ఏరియాల వారీగా రికార్డులు

    ఏరియాల వారీగా రికార్డులు

    ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్షన్లు ఇలా నమోదు అయ్యాయి. నైజాంలో ఈ చిత్రం రూ.1.5 కోట్లు వసూలు చేయడం అప్పట్లో ఓ రికార్డుగా చెప్పుకొంటారు. అలాగే సీడెడ్‌లో ఈ సినిమా రూ.1.25 కోట్లు, ఆంధ్రాలో రూ.3 కోట్లు వసూలు చేసింది. ఏపీ కాకుండా కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. కర్నాటకలో ఈ చిత్రం రూ.25 లక్షలు, మిగితా ప్రాంతాల్లో రూ.10 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం రూ.8 కోట్లు నికరంగా, 13 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    ఇప్పుడు 100 కోట్లకుపైగానే..

    ఇప్పుడు 100 కోట్లకుపైగానే..

    ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి వసూళ్లపై ట్రేడ్ అనలిస్టులు స్పందిస్తూ.. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ను రికార్డు కలెక్షన్లతో కుదిపేసింది. అప్పట్లో 13 కోట్లు రాబట్టడం చూస్తే ఇప్పుడు పరిస్తితులకు అంచనా వేస్తే అది.. 100 కోట్ల రూపాయలకుపైగానే ఉండటానికి ఆస్కారం ఉంది అని పేర్కొన్నారు.

    English summary
    30 years of Jagadeka Veerudu Athiloka Sundari: Jagadeka Veerudu Athiloka Sundari is a film, directed by K. Raghavendra Rao, from a screenplay written by Rao and Jandhyala. The Indian Super Stars Chiranjeevi and Sridevi in the lead roles. Amrish Puri, Kannada Prabhakar, Allu Ramalingaiah and Rami Reddy are featured in supporting roles. This movie was released May 09,1990. This movie collected 13 crore gross, 8 crores net all over the india.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X