JVAS Re Release Collections: బాక్సాఫీస్ మోత మోగించిన జగదేక వీరుడు.. అతిలోక సుందరికి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో అరుదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. మెగాస్టార్ చిరంజీవి, అలనాటి స్టార్ హీరోయిన్, స్వర్గీయ శ్రీదేవీ జంటగా నటించిన చిత్రం 1990 సంవత్సరంలో బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ సీ అశ్వినీదత్ నిర్మాతగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
8 కోట్ల రూపాయలతో
జగదేకవ వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని ప్రింట్ వెర్షన్ నుంచి డిజిటల్‌కు మార్పిడి చేసే ప్రక్రియను వైజయంతీ మూవీస్ చేపట్టింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో దీనావస్థలో ఉన్న ప్రింట్లను ముందుగా మరమత్తు చేసి దానిని 8K వెర్షన్‌లోకి మార్చారు. అనంతరం దానికి కలర్ గ్రేడింగ్, ఇతర టెక్నాలజీ హంగులు అద్ది 4K వెర్షన్‌లో 3డీ, 2డీ వెర్షన్లకు మార్చారు. దాదాపు ఈ ప్రాసెస్‌కు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే 3డీ వెర్షన్ క్వాలిటీ అంత గొప్పగా లేకపోయింది. కానీ 2డీ వెర్షన్ మాత్రం క్వాలిటీతో మంచి అనుభూతిని పంచింది.

2 కోట్ల బడ్జెట్ 15 కోట్ల కలెక్షన్లు
చిరంజీవి, శ్రీదేవీ కలిసి నటించిన ఈ చిత్రాన్ని భారీ తారాగణం, అప్పట్లో అధునాతన టెక్నాలజీతో అత్యంత క్వాలిటీతో రూపొందించారు. ఈ సినిమాను 2 కోట్ల రూపాయలతో రూపొందించగా.. 15 కోట్ల రూపాయల వసూళ్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఫలితాన్ని నిర్మాత అశ్వినీదత్‌కు అందించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రీ రిలీజ్‌కు భారీ స్పందన
అయితే తాజాగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను రీ రిలీజ్ చేయాలనే ఆలోచన రాగానే ఈ మూవీపై స్పెషల్ అటెన్షన్ క్రియేట్ అయింది. ఈ సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ కూడా మంచి అంచనాలను పెంచింది. దాంతో ఈ సినిమా కోసం పెయిడ్ ప్రీమియర్లు కూడా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెయిడ్ ప్రీమియర్లకు కూడా భారీ స్పందన రావడం విశేషంగా మారింది.
ఫస్ట్ డే ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్‌కు అన్ని వర్గాల నుంచి సమానంగా ఆదరణ లభించింది. మే 9వ తేదీన రిలీజైన కొత్త సినిమాలతో పోటీ పడుతూ ఈ చిత్రం వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని తెలిపారు. ఆంధ్రా, నైజాంలో ఈ మూవీ 1 కోట్ల రూపాయల గ్రాస్, కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా ఇటీవల రీ రిలీజైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
జగదేక వీరుడు లైఫ్ టైమ్ కలెక్షన్లు
జగదేవక వీరుడు అతిలోక సుందరి లైఫ్ టైమ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 2 కోట్ల రూపాయల బడ్జెట్‌తో గతంలో ఈ చిత్రం 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా కోసం మరో 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 10 కోట్ల రూపాయలుగా మారింది. ఇక ఈ సినిమా కలెక్షన్లు తాజా వసూళ్లతో కలిపి 16.75 కోట్ల రూపాయలుగా మారింది.


Click it and Unblock the Notifications











