JVAS Re Release Closing Collections: షాకింగ్‌గా జగదేక వీరుడు అతిలోక సుందరి వసూళ్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో అరుదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. మెగాస్టార్ చిరంజీవి, అలనాటి స్టార్ హీరోయిన్, స్వర్గీయ శ్రీదేవీ జంటగా నటించిన చిత్రం 1990 సంవత్సరంలో బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ సీ అశ్వినీదత్ నిర్మాతగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవీ కలిసి నటించిన ఈ చిత్రాన్ని భారీ తారాగణం, అప్పట్లో అధునాతన టెక్నాలజీతో అత్యంత క్వాలిటీతో రూపొందించారు. ఈ సినిమాను 2 కోట్ల రూపాయలతో రూపొందించగా.. 15 కోట్ల రూపాయల వసూళ్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఫలితాన్ని నిర్మాత అశ్వినీదత్‌కు అందించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు సినిమా పరిశ్రమలో తాజాగా రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండటంతో ఈ చిత్రాన్ని ప్రింట్ వెర్షన్ నుంచి డిజిటల్‌కు మార్పిడి చేసే ప్రక్రియను వైజయంతీ మూవీస్ చేపట్టింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో దీనావస్థలో ఉన్న ప్రింట్లను ముందుగా మరమత్తు చేసి దానిని 8K వెర్షన్‌లోకి మార్చారు. అనంతరం దానికి కలర్ గ్రేడింగ్, ఇతర టెక్నాలజీ హంగులు అద్ది 4K వెర్షన్‌లో 3డీ, 2డీ వెర్షన్లకు మార్చారు. దాదాపు ఈ ప్రాసెస్‌కు 1 కోటి రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే 3డీ వెర్షన్ క్వాలిటీ అంత గొప్పగా లేకపోయింది. కానీ 2డీ వెర్షన్ మాత్రం క్వాలిటీతో మంచి అనుభూతిని పంచింది.
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా నైజాం, ఆంధ్రాలో కలిపి సుమారుగా 2.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటక, ఓవర్సీస్‌లో కలిపి 65 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 3.5 కోట్లు వసూలుచేసింది.
ప్రపంచవ్యాప్తంగా జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకు మంచి ఆదరణ కనిపించింది. కొత్త సినిమాలతో పోటీపడుతూ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు ఈ చిత్రం 50 లక్షలు, మూడో రోజు 50 లక్షలు, 4వ రోజు 30 లక్షలు, 5వ రోజు 30 లక్షలు, 6వ రోజు 25 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రంపై మొత్తంగా 3 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ఖర్చు చేశారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు మొత్తంగా 18.35 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా గొప్పతనాన్ని ఈతరం ప్రేక్షకుల కూడా సోషల్ మీడియాలో తమ అనుభూతులను పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











