ఫైనల్ గా జగపతి బాబు 'గాయం-2' రిజల్టు ఏమిటి?
జగపతి బాబు తన కెరీర్ కి మళ్ళీ లైఫ్ వస్తుందని ఆశపడి...ఎన్నో ఇంటర్వూలు,స్టేట్ మెంట్స్ ఇచ్చి రిలీజ్ చేసిన చిత్రం గాయం-2. దాదాపు పదిహేడేళ్ళ క్రితం సూపర్ హిట్టైన గాయం చిత్రానికి ఇది సీక్వెల్. అయితే ఇవేమీ ప్రేక్షకుడు పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం ఓ కొత్త సినిమా, అదీ రామ్ గోపాల్ వర్మ పేరు ఉంది అని, ఎప్పుడో విన్న గాయం పేరుతో జగపతిబాబు చేసారు అన్న విషయాలను మాత్రమే చూసి ధియోటర్ లోకి వచ్చిన అతనికి పూర్తి నిరాశే ఎదురైంది. ఎందుకంటే దుర్గా పాత్ర మళ్ళీ తిరిగివచ్చి ఏం చేస్తుందనేదే కథ అని పబ్లిసిటీలో ఊదరకొట్టి పోస్టర్స్ పై హిస్టరీ ఈజ్ బ్యాక్ అని రాశారు. అది దృష్టిలో పెట్టుకుని వచ్చిన వారికి ఓ సస్పెన్స్ డ్రామా చూపటం మొదలెట్టారు. ధాయల్యాండ్ లో ఓ కాఫీ హౌస్ నడుపుకునే వ్యక్తి..అంటూ కథ మళ్ళీ మొదలపెట్టారు. చూసేవారికి ముందే చెప్పాం కదా..దుర్గ(జగపతిబాబు) మళ్ళీ వస్తే ఏమవుతుందనే విషయమే కథ అని, అలాగే సీక్వెల్ అని కూడా పబ్లిసిటీ చేస్తున్నాం కదా ఎందుకు ఆ దుర్గా, ఆ కాఫీ హౌస్ వ్యక్తి వేరు వేరుని అని చెప్తే ఎందుకు ధ్రిల్ అవ్వాలి అన్న ఆలోచన లేకుండా ఇంటర్వెల్ దాకా అలాగే నడిపేసారు. ఇక ఇంటర్వెల్ తర్వాత దుర్గా ఎందుకు వచ్చాడు...ధుర్గాని రెచ్చగొట్టి పిలిచిన విలన్ (కోట) ఆ విషయం తప్ప మిగిలిన అన్ని విషయాలమీద ఎందుకు కాన్సర్టేట్ చేస్తూంటాడో అర్ధంకాదు. ఇలా గాయం ..కథ, కథనాలలోనే పూర్చలేని గోతులతో వచ్చి, ప్రేక్షకులుకు గాయాలు చేసి, రెండో రోజుకే ధియోటర్స్ ఖాళీ అయ్యేలా చేసింది.


Click it and Unblock the Notifications











