జై లవకుశ వసూళ్ల సునామీ.. వందకోట్ల క్లబ్‌లో ఎన్టీఆర్.. సమీక్షకులకు చెంపపెట్టా?

By Rajababu

ప్రపంచవ్యాప్తంగా జై లవకుశ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ నటించిన మరో చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కెరీర్‌లో జై లవకుశ రూపంలో మరో బ్లాక్ బస్టర్ చేరింది. రిలీజ్ రోజున డివైడ్ టాక్ వచ్చినప్పటికీ జై లవకుశ దానిని అధిగమించి కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్నది. తాజా వివరాల ప్రకారం జై లవకుశ గత నాలుగు రోజుల్లో 115 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఇదే దూకుడు ప్రదర్శిస్తే జై లవకుశ కలెక్షన్లపరంగా ఎన్టీఆర్‌కు నెంబర్ వన్ చిత్రంగా మిగిలిపోవడం ఖాయం.

తెలుగు రాష్ట్రాల్లో హవా

జై లవకశ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. ఏపీ, తెలంగాణాలో కలిపి వారాంతానికి మొత్తం 62 కోట్లు వసూలు చేసింది. తెలుగేతర రాష్ట్రాలైన కర్ణాటకలో 11 కోట్లు, తమిళనాడులో 2.25 కోట్లు, మిగితా ప్రాంతాల్లో 7.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. వారాంతం తర్వాత కూడా ఈ చిత్రం బలంగా దూసుకెళ్తున్నట్టు సమాచారం.

అమెరికాలో దూకుడు

అమెరికాలో జైలవకుశ వసూళ్ల దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ చిత్రం ఐదు రోజుల్లో 1,394,610 డాలర్లను వసూళు చేసింది. అంటే దాదాపు 9.08 కోట్లను కొల్లగొట్టింది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. బుధ, గురువారాల్లో ఈ చిత్రం 744,130 డాలర్లను, శుక్రవారం 264,952 డాలర్లు, శనివారం 283,593, ఆదివారం 101,935 డాలర్లను వసూలు చేసిందని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

డివైడ్ టాక్‌ను అధిగమించి..

డివైడ్ టాక్‌ను అధిగమించి..

జై లవకుశ చిత్రానికి రిలీజైన మొదటి రోజున ప్రేక్షకుల నుంచి, సినీ విశ్లేషకుల నుంచి డివైడ్ టాక్ వినిపించింది. అయితే లాండ్ వీకెండ్ కావడం అంతేకాకుండా మార్కెట్లో మంచి సినిమాలు లేకపోవడమనే అంశాలు జై లవకుశకు కలిసివచ్చిన అవకాశం. దాంతో వసూళ్ల వేగం పుంజుకొన్నది.

Recommended Video

Jai Lava Kusa Success Meet : NTR counters film critics strongly
అత్యధిక థియేటర్లు..

అత్యధిక థియేటర్లు..

జై లవకుశను వంద కోట్ల క్లబ్ వైపు నడిపించడానకిి మరో ప్రధాన కారణం అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయడం. ప్రపంచవ్యాప్తంగా జై లవకుశ చిత్రం 2400 స్క్రీన్లలో రిలీజైంది. కేవలం హైదరాబాద్‌లోనే 100 స్క్రీన్లలో ఈ చిత్రం ప్రదర్శించబడింది. దాంతో కలెక్షన్లు ఏకపక్షంగా జై లవకుశ ఖాతాలోకి చేరాయి.

బిగ్‌బాస్ దెబ్బ..

బిగ్‌బాస్ దెబ్బ..

జై లవకుశ చిత్రంపై బిగ్‌బాస్ రియాల్టీ షో కూడా ప్రభావం చూపినట్టు తెలిసింది. బిగ్‌బాస్ చివరి వారం ఎపిసోడ్స్‌పై ఆసక్తి పెంచుకోవడం, ఫైనల్‌ కార్యక్రమం కోసం ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోవడంతో కలెక్షన్లలో తేడా పడినట్టు సమాచారం.

రివ్యూలపై ఎన్టీఆర్ ఆగ్రహం..

రివ్యూలపై ఎన్టీఆర్ ఆగ్రహం..

జై లవకుశ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సినీ విమర్శకులను ఏకిపారేశారు. సినిమా ఐసీయూలో చేరిన పేషంట్ లాంటింది. అలాంటి దానిని ఎలాంటి పరీక్షలు లేకుండా చంపడం సమంజసం కాదు. డాక్టర్ల లాంటి ప్రేక్షకులు నిర్ణయించాలి. అంతేకానీ దారినపోయే దానయ్య ల్లాంటి కొందరు సినీ విమర్శకులు సినిమాను చంపేస్తున్నారు అని ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X