150 కోట్ల క్లబ్‌లో జై లవకుశ.. ఎన్టీఆర్ దుమ్ము దులిపినా.. నష్టాల్లోనే బయ్యర్లు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం అంచనాలకు మంచి దూసుకెళ్తున్నది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం అంచనాలకు మంచి దూసుకెళ్తున్నది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రం 150 కోట్ల వసూళ్లను సాధించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే అధికారికంగా ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ఎలాంటి ప్రకటన ఇంకా చేయలేదు.

అమెరికాలో 1.5 మిలియన్లు
జై లవకుశ చిత్రం అమెరికాలో మూడో వారంలో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. శుక్రవారం 17 వందల డాలర్లు, శనివారం 4500 డాలర్లు, ఆదివారం సుమారు 2 వేల డాలర్లు వసూళు చేసింది. ఇప్పటివరకు మొత్తంగా 1,552,735 డాలర్లు సాధించింది. అంటే 10.16 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 57 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీగా వసూళ్లను రాబడుతున్నది. నైజాంలో 16 కోట్లకుపైగా, సీడెడ్లో 12 కోట్లు, ఉత్తరాంధ్రలో 7 కోట్లు, తూర్పు గోదావరిలో 5.5 కోట్లు, పశ్చిమగోదావరిలో 4.5 కోట్లు, గుంటూరులో 6 కోట్లు, నెల్లూరులో 2.5 కోట్లు రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో జై లవకుశ చిత్రం 57 కోట్ల షేర్ వసూలు చేసినట్టు సమాచారం.

ఇతర రాష్ట్రాల్లో..
ఇక కర్ణాటక రాష్ట్రంలో 10 కోట్లు, తమిళనాడులో 1.3 కోట్లు వసూలు చేసింది. మిగితా రాష్ట్రాల్లో 1.5 కోట్లు, ఓవర్సీస్ (అమెరికా కాకుండా)లో 2.5 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 77 కోట్లకుపైగా కలెక్ట్ చేసినట్టు తెలుస్తున్నది.

150 కోట్ల క్లబ్‌లో
ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లను పరిశీలిస్తే గత మూడువారాల్లో దాదాపు 150 కోట్లకు చేరినట్టు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఖైదీ నంబర్ 150 చిత్రం 164 కోట్లు, శ్రీమంతుడు చిత్రం 156 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రికార్డులను అధిగమిస్తుందా లేదా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.

ఇంకా నష్టాల్లోనే డిస్టిబ్యూటర్లు..
అయితే జై లవకుశ భారీ కలెక్షన్లు సాధిస్తున్నప్పటికీ డిస్టిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి చేరుకోకపోవడం ఆందోళన కలిగించే అంశం. డిస్టిబ్యూటర్లు నష్టాల నుంచి గట్టెక్కడానికి దాదాపు 86 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ వారాంతానికి ఆ మొత్తం వసూలు అయ్యేటట్టు కనిపించడం లేదు. మొత్తంగా జై లవకుశ 80 కోట్లు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











