బాహుబలికి ధీటుగా జై లవకుశ.. తొలిరోజే కలెక్షన్ల సునామీ.. ట్రేడ్ రిపోర్ట్ ఇదే..

By Rajababu

Recommended Video

Jai Lava Kusa first day Collections ready to beat Baahubali బాహుబలికి ధీటుగా..

జై లవకుశ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది. అందుకు తగినట్లుగానే ఇది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందని వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తొలి రోజు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని స్థాయిలో ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని సదరు వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కలెక్షన్ల ధాటికి గత రికార్డులు తుడిచిపెట్టుకునిపోతాయని అంచనా వేస్తున్నారు. అలాగే మొదటి రోజు వసూళ్లు తారక్ కెరీర్ లోనే మరుపురాని మైలురాయిగా నిలిచిపోతుందని చెప్తున్నారు.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేయడంతోపాటు టీజర్ ట్రైలర్స్ ఈ చిత్రంపై అప్పటివరకున్న అంచనాల్ని మరింత పెంచాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో జై పాత్ర విపరీతంగా ఆకట్టుకోవడంతోపాటు భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం తొలిసారి అంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు వసూల్ చేస్తుందని చెబుతున్నారు.

ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో..

ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో..

అటు ఓవర్సీస్ లోను అత్యధిక స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో అక్కడ కూడా విపరీతంగా కలెక్షన్లు వసూల్ అవుతాయని తెలుస్తుంది. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు మిలియన్ డాలర్‌కి చేరువలో కలెక్షన్స్ కొల్లగొట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

తొలి రోజు రెండు రాష్టాల్లో..

తొలి రోజు రెండు రాష్టాల్లో..

ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ ప్రకారం... తొలిరోజు జై లవకుశ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 24 నుంచి 25 కోట్ల షేర్ కలెక్ట్ అవతుందని వాణిజ్య వర్గాల్లో ఓ అంచనా. ఆదే నిజమైతే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 100 చిత్రం ఖైదీ నం. 150 తో నాన్ బాహుబలి రికార్డ్ పటాపంచలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

కర్ణాటకలోనూ..

కర్ణాటకలోనూ..

ఇక పక్క రాష్ట్రమైన కర్ణాటకలోనూ ఎన్టీఆర్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దాంతో అక్కడ కూడా మంచి వసూళ్లు వస్తాయని... అలాగే రెస్టాఫ్ ఇండియాలో డీసెంట్ కలెక్షన్లు నమోదు కావచ్చని చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2400 స్క్రీన్లు..

ప్రపంచవ్యాప్తంగా 2400 స్క్రీన్లు..

బాహుబలి తర్వాత జై లవకుశ అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అవుతున్న చిత్రంగా రికార్డు సొంతం చేసుకొన్నది. జై లవకుశ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2400 స్క్రీన్లలో రిలీజ్ అవుతున్నది. కేవలం హైదరాబాద్‌లోనే 100 స్క్రీన్లలో ప్రదర్శించబడటం ఓ రికార్డు అని చెప్పవచ్చు.

ఫస్ట్ డే కలెక్షన్లు 30 కోట్లు..

ఫస్ట్ డే కలెక్షన్లు 30 కోట్లు..

మొత్తంగా చూస్తే... ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు రూ. 30 నుంచి 31 కోట్లు షేర్ కలెక్ట్ చేయవచ్చని వాణిజ్య వర్గాల అంచనా. ఈ లెక్కన తొలిసారి రూ. 50 కోట్ల గ్రాస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే... గత రికార్డులన్నీ పటాపంచలైనట్లే. మరి ఆ వాణిజ్య నివేదిక ఎంత వరకు నిజమవుతుందో తెలియాలంటే.. ఫస్ట్ డే కలెక్షన్స్ అధికారికంగా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X