twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జై సింహా కలెక్షన్లు అలా.. అఙ్ఞాతవాసి ఇలా.. పాపం డిస్టిబ్యూటర్లు..

    నందమూరి నటసింహాం బాలకృష్ణ నటించిన జైసింహా సినిమా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కలెక్షన్లు మోస్తారుగా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    By Rajababu
    |

    Recommended Video

    జై సింహా అలా..అఙ్ఞాతవాసి ఇలా.. పాపం డిస్టిబ్యూటర్లు..!

    2018 సంక్రాంతి అటు ప్రేక్షకులకు, ఇటు డిస్టిబ్యూటర్లకు నిరాశే మిగిల్చాయి. అఙ్ఞాతవాసి చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టడంతో డిస్టిబ్యూటర్లు, సినీ అభిమానులు ఊపిరి పిల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో నందమూరి నటసింహాం బాలకృష్ణ నటించిన జైసింహా సినిమా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కలెక్షన్లు మోస్తారుగా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    జై సింహ ప్రివ్యూ కలెక్షన్స్

    జై సింహ ప్రివ్యూ కలెక్షన్స్

    బాలకృష్ణ, దర్శకుడు కేఎస్ రవికుమార్ రూపొందించిన జై సింహా చిత్రానికి క్రిటిక్స్, ఆడియెన్స్ నుంచి పెద్దగా స్పందన వ్యక్తం కాలేదు. అమెరికాలో జై సింహ చిత్రం 84 స్క్రీన్లలో గురువారం ప్రివ్యూ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దాంతో $107,512 డాలర్లు అంటే రూ. 68.35 లక్షలు వసూలైంది అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.

    రెండు రోజుల జై సింహా

    రెండు రోజుల జై సింహా

    కాగా, జై సింహా చిత్రం శుక్ర, శనివారాల్లో అమెరికాలో ఓ మోస్తరు కలెక్షన్లు సాధించింది. శుక్రవారం జై సింహా చిత్రం రూ.52 లక్షలు (26 వేల డాలర్లు), శనివారం రూ.53లక్షలు వసూలు చేసింది. మొత్తంగా అమెరికాలో ప్రివ్యూతోపాటు రెండురోజుల కలెక్షన్లు రూ.1.70 లక్షలు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.

    తెలుగు రాష్ట్రాల్లో జై సింహా

    తెలుగు రాష్ట్రాల్లో జై సింహా

    తెలుగు రాష్ట్రాల్లో జై సింహా కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. శుక్ర, శనివారాల లెక్కల ప్రకారం తెలంగాణ, ఏపీలో ఈ చిత్రం రూ.8.83 కోట్లు వసూలు చేసింది. బాలకృష్ణ సినిమా వరకు ఇవి ఓ రకంగా అత్యుత్తమమే అని చెప్పుకోవచ్చనే అభిప్రాయాన్ని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.

    నైజాంలో బాలయ్య హవా

    నైజాంలో బాలయ్య హవా

    తెలంగాణ ప్రాంతంలో జై సింహా కలెక్షన్లు సానుకూలంగానే ఉన్నాయి. నైజాం ప్రాంతంలో జై సింహ రూ. 1.65 కోట్లు వసూలు చేసింది. వారాంతంలో కొంత పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.

    ఏపీలో బాలయ్య వసూళ్లు

    ఏపీలో బాలయ్య వసూళ్లు

    ఏపీలో జై సింహా కలెక్షన్లు ఈ విధంగా నమోదయ్యాయి. సీడెడ్‌లో రూ.2.03 కోట్లు, తూర్పు గోదావరిలో 0.92 కోట్లు, పశ్చిమ గోదావరిలో 0.88 కోట్లు, గుంటూరులో రూ.1.31 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.61 లక్షలు వసూలు చేసింది.

    అమెరికాలో అఙ్ఞాతవాసి

    అమెరికాలో అఙ్ఞాతవాసి

    ఇక అమెరికాలో అఙ్ఞాతవాసి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. శుక్ర, శనివారాల్లో ఈ చిత్రం రూ.2.91 కోట్లు (73,263 డాలర్లు) వసూూలు చేసింది అని రమేష్ బాలా ట్వీట్‌లో పేర్కొన్నారు.

     తెలుగు రాష్ట్రాల్లో అఙ్ఞాతవాసి

    తెలుగు రాష్ట్రాల్లో అఙ్ఞాతవాసి

    అఙ్ఞాతవాసి సినిమా ఏపీ, తెలంగాణలో గత నాలుగు రోజుల్లో ఈ విధంగా కలెక్షన్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ చిత్రం సుమారు రూ.33.22 కోట్లు వసూలు చేసింది.

    అఙ్ఞాతవాసి ప్రాంతాల వారీగా

    అఙ్ఞాతవాసి ప్రాంతాల వారీగా

    తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో 8.63 కోట్లు, సీడెడ్‌లో 4.4 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.4.58 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.3.19 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3.98 కోట్లు, గుంటూరు రూ.4.32 కోట్లు, నెల్లూరు రూ.1.84 కోట్లు వసూలు చేసింది.

    English summary
    Directed by KS Ravikumar, the Sankranti offering received lukewarm response from critics and audience alike. Trade expert Ramesh Bala posted stating that there has been a huge drop in the collections of 'Jai Simha' and Agnyaathavaasi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X