Jailer 2 AP TG Business: జైలర్ 2 ఆంధ్రా- నైజాం రైట్స్‌‌కి రికార్డ్ ధర.. రజనీకాంత్ మూవీకి ఎన్ని కోట్లంటే?

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ మంచి జోరు మీదున్నారు. 75 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీపడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు తలైవా. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జైలర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఆంధ్రా - నైజాంలలో జైలర్ 2 బిజినెస్‌కు సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

జైలర్ 2 తారాగణం
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఈ జైలర్ 2 సినిమాను నిర్మిస్తున్నారు. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, యోగిబాబు, మిర్ణా మీనన్, అన్నా రాజన్, జతిన్ సార్ణా, సూరజ్ వెంజారమూడు తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా, విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

Jailer 2 AP TG Business Rajinikanth s film Set To Make History With Its Telugu Rights

జైలర్ 2 ముందస్తు రిలీజ్?
స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 12న జైలర్ మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. అయితే జైలర్ 2 జోరు చూస్తుంటే షెడ్యూల్ కంటే ముందుగానే ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సినిమా షూటింగ్‌ను అనుకున్న టైం కంటే ముందే పూర్తి చేయడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను నెల్సన్ పరుగులు పెట్టిస్తున్నారు. మే చివరి నాటికి ఫైనల్ కాపీ రెడీ చేసి.. సెన్సార్‌కి వెళ్లాలని నెల్సన్ భావిస్తున్నారట. జూన్ 4న పెద్ది రిలీజ్ అవుతుండగా.. అదే నెలలో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల రిజల్ట్‌ని బట్టి జైలర్ 2 రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా జైలర్ 2 ఆగస్టులోనే వస్తుందని వాదిస్తున్నారు.

జైలర్ 2 బిజినెస్‌పై ఇండస్ట్రీ కన్ను
మరోవైపు.. జైలర్ 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌ హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఏకంగా 160 కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తద్వారా అత్యధిక ఓటీటీ బిజినెస్ జరిగిన తమిళ సినిమాగా జైలర్ 2 నిలిచింది. ఇప్పుడు జైలర్ 2కి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ కూడా అంతే హాట్ టాపిక్‌గా మారింది. రజనీకాంత్‌కి తమిళనాడుతో సమానంగా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలన్నీ తెలుగు, తమిళ భాషలలో ఒకేరోజు విడుదలై.. రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేసిన ఉదంతాలెన్నో.

జైలర్ 2 తెలుగు రైట్స్‌కి భారీ ధర?
జైలర్ మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. దాంతో జైలర్ 2కి సంబంధించి తెలుగు డబ్బింగ్, పంపిణీ హక్కుల కోసం టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి గట్టి పోటీ నెలకొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి జైలర్ 2.. ఆంధ్రా- నైజాం థియేట్రికల్ రైట్స్‌కి నిర్మాతలు 60 కోట్ల రూపాయల ధర నిర్ణయించారట. జైలర్ మొదటి భాగం సక్సెస్ నేపథ్యంలో తెలుగు రైట్స్ ఈ రేంజ్‌లో ధర పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే జైలర్ తర్వాత వచ్చిన రజనీకాంత్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. కూలీ తెలుగు రైట్స్‌ 52 కోట్ల రూపాయలు ధర పలకగా.. థియేట్రికల్ రన్‌లో మాత్రం కేవలం 50 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇప్పుడు జైలర్ 2కి 60 కోట్లంటే .. తెలుగులో ఈ సినిమా బ్రేక్ఈవెన్ కావాలంటే 125 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. మరి నిజంగానే జైలర్ 2 రేటు ఆ స్థాయిలో ఉందా? అంత ధర చెల్లించి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు రైట్స్ కొనుగోలు చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X