Jailer: తెలుగు గడ్డపై జైలర్ ఊచకోత.. రజినీకాంత్‌కు కోట్లు.. చిరంజీవికి లక్షల్లోనేనా!

ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న సినిమా పేర్లలో 'జైలర్' ఒకటి. అంతలా ఈ చిత్రం రిలీజ్‌కు ముందు నుంచే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని సెన్సేషన్ అయింది. దీనికి కారణం ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించడమే అని చెప్పాలి. చాలా కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తోన్న ఆయన.. ఈ సారి గట్టిగానే కొట్టాలని బరిలో దిగుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా అన్ని ఏరియాల్లో హవాను చూపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాను దాటేసింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

'జైలర్'గా వస్తున్న రజినీకాంత్:సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సినిమానే 'జైలర్'. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు తదితరులు నటించారు.

Jailer Breaks Bhola Shankar Collections In Advance Booking

అంచనాలకు తగ్గట్లుగా బిజినెస్:'జైలర్' మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా అప్‌డేట్లకు భారీ స్పందన దక్కింది. ఇక, అన్ని భాషల్లో దీని హక్కులకు గట్టి పోటీ ఏర్పడింది. ఫలితంగా అన్ని ఏరియాల రైట్స్ కలిపి భారీ ధరకు అమ్ముడు పోయాయి. అలాగే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 3 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

Jailer Breaks Bhola Shankar Collections In Advance Booking

అడ్వాన్స్ బుకింగ్స్.. హౌస్‌ఫుల్స్‌:ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న 'జైలర్' సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో దీన్ని ఆగస్టు 10న ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలు పెట్టగా.. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడు అయిపోయాయి. తెలుగులోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించిందనే చెప్పాలి.

Jailer Breaks Bhola Shankar Collections In Advance Booking

చెన్నైలో రజినీకాంత్ ఊచకోత:సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీకి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో జరిగాయి. ముఖ్యంగా చెన్నై నగరంలో ఈ సినిమా దుమ్ము దులిపేసింది. ఇలా ఫస్డ్ డే బుకింగ్స్‌లో ఈ చిత్రం ఏకంగా రూ. 3.89 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. కానీ, 'భోళా శంకర్' మాత్రం అక్కడ రూ. 5 లక్షలు మాత్రమే గ్రాస్‌ను రాబట్టింది.

Jailer Breaks Bhola Shankar Collections In Advance Booking

బెంగళూరులోనూ సూపర్ స్టారే:'జైలర్' మూవీకి బెంగళూరు సిటీలోనూ అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. దీంతో ఈ చిత్రం అక్కడ ఫస్ట్ డేకు సంబంధించి ఏకంగా రూ. 5.75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. కానీ, 'భోళా శంకర్' మాత్రం అక్కడ కేవలం రూ. 22 లక్షలు మాత్రమే రాబట్టింది. అంటే.. అటు చెన్నై, ఇటు బెంగళూరులో రజినీకాంత్ సినిమానే హవాను చూపించిందని చెప్పుకొవచ్చు.

Jailer Breaks Bhola Shankar Collections In Advance Booking

హైదరాబాద్‌లో కూడా జైలరే:ఇక, హైదరాబాద్ విషయానికి వస్తే.. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో 'జైలర్' మూవీకి రూ. 2.20 కోట్లు గ్రాస్ వచ్చింది. అందులో తెలుగు వెర్షన్‌కు రూ. 1.78 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 42 లక్షలు వచ్చాయి. అయితే, 'భోళా శంకర్' మూవీ మాత్రం ఇప్పటి వరకూ రూ. 2.05 కోట్లు వసూలు చేసింది. ఇలా తెలుగులోనూ రజినీకాంత్ మూవీనే ముందు ఉంది.

Jailer Breaks Bhola Shankar Collections In Advance Booking

రిలీజ్ సమయానికి పెరిగేలా:వాస్తవానికి 'జైలర్' మూవీ నేడు విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ ప్రధాన నగరాల్లోని మెజారిటీ థియేటర్లు ఆ సినిమాకే వెళ్లాయి. అందుకే 'భోళా శంకర్' మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ తగ్గిపోయాయి. ఈరోజు మాత్రం చిరంజీవి చిత్రానికి వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. చెన్నై, బెంగళూరులో కాకున్నా.. హైదరాబాద్‌లో మాత్రం 'జైలర్' రికార్డు బద్దలయ్యే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X