Jailer Collections: రజినీకాంత్ జైలర్ కలెక్షన్ల సునామీ... ఎన్ని కోట్లు వసూళ్లను కొల్లగొట్టిందంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఇక ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్లలో వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్ రిలీజ్ అయింది. ఇక మొదటి ఆట నుంచే ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ఇక ఈ చిత్రానికి బీస్ట్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు భారీగానే అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సూపర్‌స్టార్ రజనీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన జైలర్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 10న అంటే ఈరోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అభిమానులు అయితే.. రజినీకి ఇది కదా కావాల్సింది హిట్టు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Rajinikanths Jailer Movie worldwide Day1 Expected Collections Details Here

జైలర్ కలెక్షన్స్ విషయానికి వస్తే... ఈ సినిమా బుకింగ్స్ భారీగా ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 185 థియేటర్స్ లో, సీడెడ్ లో 85 థియేటర్స్ లో, ఆంధ్రలో 230 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 500 కి పైగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవ్వగా... అద్బుతమైన బుకింగ్స్ తో జోరు చూపిస్తూ రజినీ దూసుకుపోతున్నారు.

ఇక జైలర్ సినిమా తమిళనాడులో 8 కోట్ల రేంజ్ ప్రీ బుకింగ్స్, కర్ణాటకలో 7 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకుందని సమాచారం. దేశం మొత్తం ఈ సినిమా బుకింగ్స్ 17 కోట్లకు పైగా బుకింగ్స్ జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ తో కలిపి మొత్తంగా 30 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చెసుకున్నట్లు సమాచారం.

Rajinikanths Jailer Movie worldwide Day1 Expected Collections Details Here

రజినీ కాంత్ జైలర్ మూవీ... ఇటీవల రజినీ సినిమాల్లో రోబో 2.0 తర్వాత బెస్ట్ బుకింగ్స్ తో జైలర్ ముందంజలో ఉంది. ఇప్పటికే ఈ షోస్ పడ్డాయి. ఇదే పాజిటివ్ టాక్.. మౌత్ టాక్ కంటిన్యూ అయింతే... తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ జోరుని జైలర్ పెంచుకోవచ్చు. తొలిరోజు ఓవరాల్ గా 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా తమిళనాడులో సినిమా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. ఇ సినిమా కర్ణాటకలో 10 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టొచ్చని ట్రేడ్ వర్గాల సమాచారం.

Rajinikanths Jailer Movie worldwide Day1 Expected Collections Details Here

ఇక జైలర్ తొలిరోజు ఇండియాలో 45 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 70 కోట్ల నుండి 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. మరి జైలర్ ఈ అంచనాలను మించి మొదటి రోజు జోరు ఎంతవరకు చూపిస్తుందో కలెక్షన్స్ వివరాలు చూడాలి. ఏది ఏమైనప్పటికీ రజినీ జైలర్.. ఫ్యాన్స్ కే కాకుండా.. అన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా నచ్చుతుందని టాక్ వినిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X