Jailer day 2 Collections రజనీకాంత్ బాక్సాఫీస్ మ్యాజిక్.. 100 కోట్లు కొల్లగొట్టిన జైలర్!

సూపర్‌స్టార్ రజనీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, శివ రాజ్‌కుమార్, మోహన్ లాల్, సునీల్, యోగిబాబు నటించిన తాజా చిత్రం జైలర్. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమాకు సినీ విమర్శకులు, సగటు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్‌ రావడంతో భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఈ సినిమా కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే..

రజనీ, శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్‌ కలిసి: జైలర్ సినిమాలో అగ్ర నటులు భారీగా ఉండటంతో బడ్జెట్ భారీగానే పెరిగిపోయింది. గతంలో రజనీకాంత్ నటించిన సినిమాల కంటే ఎక్కువ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రజనీకాంత్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ రెమ్యునరేషన్లతో కలిపి మొత్తంగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా బడ్జెట్‌కు తగినట్టుగానే బిజినెస్ భారీగా జరిగింది.

 Jailer

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: జైలర్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. రజనీకాంత్ స్టామినాకు ఏ మాత్రం తగ్గకుండా విడుదలకు ముందే వ్యాపారం జరిగింది. తమిళనాడులో థియేట్రికల్ హక్కులు 65 కోట్లు, ఆంధ్రా, తెలంగాణలో కలిపి 15 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 10 కోట్లు, కేరళలో 6 కోట్ల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 5 కోట్లు, ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు 30 కోట్లకుపైగా అమ్ముడుపోయాయి.

ప్రపంచవ్యాప్తంగా జైలర్ స్క్రీన్ కౌంట్: జైలర్ సినిమాకు క్రేజ్ భారీగా ఉండటంతో సినిమాను రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజ్ చేశారు. తమిళనాడులో అత్యధికంగా 1200 స్క్రీన్లలో, ఆంధ్రా, నైజాంలో 550 స్క్రీన్లలో, కేరళ, కర్ణాటకలో 600 స్క్రీన్లలో విడుదల చేశారు. ఓవర్సీస్‌లో అంటే అమెరికా, కెనడా, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 3000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

 Jailer

తొలి రోజు జైలర్ కలెక్షన్లు: జైలర్ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 23 కోట్ల గ్రాస్, ఆంధ్రాలో, నైజాం ప్రాంతంలో 13 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 12 కోట్ల రూపాయలు, కేరళలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 35 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 91 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

జైలర్ మూవీ రెండో రోజు వసూళ్లు: జైలర్ సినిమా రెండో రోజు బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం స్టడీగా వసూళ్లను రాబడుతున్నది. రెండో రోజు కూడా భారీ కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇండియాలో 35 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా దాదాపు 60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

 Jailer

వేగంగా 100 కోట్ల క్లబ్‌లో: ఇక రజనీకాంత్ బాక్సాఫీస్ మ్యాజిక్‌ను జైలర్ మూవీ రీ క్రియేట్ చేసింది. రజనీకాంత్ కెరీర్‌లో వేగంగా 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా జైలర్ రికార్డు క్రియేట్ చేసింది. రెండో రోజే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఓ రికారడ్ుగా చెప్పుకొంటున్నారు. ఈ సినిమా రానున్న రోజుల్లో భారీ కలెక్షన్లు సాధించి.. రికార్డులు తిరగరాసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X