Jailer day 3 Collections బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన రజనీకాంత్.. మూడో రోజుల్లోనే జైలర్ 200 కోట్లు

సూపర్‌ప్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తున్నది. కేవలం తమిళనాడులోనే కాకుండా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. దర్శకుడు నెల్సన్ రూపొందించిన ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తెలుగు కమెడియన్ సునీల్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించడం తెలిసిందే. ఈ సినిమా తొలి ఆట నుంచి వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రం మూడో రోజు కలెక్షన్ల అంచనాల్లోకి వెళితే..

రజనీకాంత్ నటించిన జైలర్ టీజర్, ట్రైలర్, ప్రోమోల భారీ క్రేజ్ సంపాదించడంతో ప్రీ రిలీజ్ కూడా భారీగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ రికార్డు స్థాయిలోనే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయల బిజినెస్ రిలీజ్‌కు ముందే చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3000 స్క్రీన్లలో రిలీజైంది. పబ్లిక్ డిమాండ్ ఏర్పడటంతో ఇంకా స్క్రీన్లు పెంచుతున్నారు.

 Jailer day 3 Collections

జైలర్ చిత్రం తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో 23 కోట్ల గ్రాస్, ఏపీ, నైజాంో 13 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 12 కోట్ల గ్రాస్, కేరళలో 5.85 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 35 కోట్ల గ్లాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇండియాలో 55 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. పాన్ ఇండియా సినిమా కాకుండానే ఈ చిత్రం అంతకు మించి కలెక్షన్లు రాబడుతున్నది.

జైలర్ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 21 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 4 కోట్ల రూపాయలు, కేరళలో 2 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5 కోట్లు, హిందీలో 3 కోట్లు వసూలు చేసింది. అమెరికా, యూకే, ఇతర దేశాల్లో మొత్తంగా 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది.

ఇక జైలర్ మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగించింది. ఈ సినిమా రెండు రోజుల్లో 140 కోట్లు రాబట్టింది. మూడో రోజు అదే ఊపును కొనసాగించింది. మూడో రోజున ఈ చిత్రం మరో 60 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 200 కోట్ల వసూళ్లను సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల కాలంలో మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూలు చేయడం రికార్డుగా మారింది.

 Jailer day 3 Collections

జైలర్ చిత్రం బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ లాభాల్లోకి చేరుకొనేందుకు పరుగులు పెడుతున్నది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 120 కోట్లు నికరంగా వసూలు చేయాల్సి ఉంది. దాదాపు ఈ టార్గెట్‌కు దాదాపు చేరువైందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జైలర్ కలెక్షన్ల ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X