Jailer Day 4 Collections: అదిదా తలైవా.. బాక్సాఫీస్ వద్ద జైలర్ ఊచకోత.. నాలుగు రోజుల్లోనే ఎంత లాభం వచ్చిందంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. ఇక ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయింది. ఇక ఈ మూవీకి బీస్ట్ ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇక విడుదలైన మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 200కోట్ల మార్కు దాటిన ఈ మూవీ.. నాలుగో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తలైవా రజినీకాంత్ నటించిన జైలర్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే.. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన జైలర్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. తమన్నా హీరోయిన్ గా నటించగా.. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటించారు.

ఇక జైలర్ మూవీ విషయానికి వస్తే... ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్ల రూపాయలకు పైగా జరిగిందని తెలుస్తోంది. జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3000 స్క్రీన్లలో విడుదల అయింది. విడుదల అయినప్పటి నుంచి బాక్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రావడంతో.. ఇంకా స్క్రీన్లు పెంచుతున్నారని సమాచారం.
ఇక జైలర్ తొలిరోజు కలెక్షన్స్ విషయానికి వస్తే... ఇండియాలో 55 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 90 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది. ఇక రెండో రోజు కలెక్షన్స్... ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇక మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగించింది. ఈ సినిమా రెండు రోజుల్లో 140 కోట్లు రాబట్టగా... మూడో రోజు అదే ఊపును కొనసాగించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 214.15 కోట్లు గ్రాస్, రూ. 105.10 కోట్లు షేర్ వచ్చింది.

ఇక జైలర్ మూవీ నాలుగో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే... జైలర్ ఊచకోత మాత్రం ఆగట్లేదు. నాల్గో రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ 35 కోట్లకు పైగా వసూలు చేయనుందని ట్రెడ్ వర్గాల చెబుతున్నాయి. దీనితో నాలుగు రోజుల్లో ఇండియాలో రూ.143.40 కోట్ల నెట్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక జైలర్ మూవీ నాలుగు రోజుల్లో 108.4 కోట్ల రూపాయల నెట్ వసూలు చేయగా.. 127.1 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సిస్ లో 95 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీనితో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 222.1 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. 120 కోట్లు నికరంగా వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే 7 కోట్ల రూపాయల లాభంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక తెలుగులో భోళాశంకర్ డీలాతో జైలర్ మూవీకి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక ఇండియాలో జైలర్ ఏం రికార్డులు సృష్టించనుందో చూడాలి.


Click it and Unblock the Notifications











