Jailer Day 6 Collections: అదిదా రజినీ స్టామినా... ఆరో రోజుకి రూ.400 కోట్లు.. మాస్ కా అమ్మ మొగుడు?
తలైవా సూపర్ స్టార్ రజినీ కాంత్ చాలా కాలం తర్వాత మళ్లీ జైలర్ సినిమాతో తన సత్తా ఏమిటో చూపిస్తున్నారు. 70 ఏళ్లు వచ్చాయి.. రిటైర్ హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చుగా అనే వారికి జైలర్ సినిమాతో కౌంటర్ ఇచ్చారు రజినీ. ఇక ఆయన నటించిన ఈ జైలర్... బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల గ్రాస్ ను రూ.173 కోట్లకుపైగా షేర్‌ను రాబట్టింది. అయితే ఇక ఆరో రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే...
సూపర్ స్టార్ రజనీ కాంత్ స్టామినా ఏంటో మరోసారి బహిర్గతం అయింది. ఆయన నటించిన తాజా చిత్రం జైలర్. బీస్ట్ సినిమాతో విమర్శలు మూటగట్టుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఎప్పటిలాగానే రజినీ మూవీకి మరోసారి అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

తన కొడుకు మరణంపై ప్రతీకారం తీర్చుకునే రిటైర్డ్ జైలర్ గా రజనీ కాంత్ ఈ సినిమాలో నటించారు. ఇక ఆయన తన యాక్టింగ్, మేనరిజమ్స్ తో పాటు అదిరిపోయే స్టైల్ తో మరోసారి ఆకట్టుకున్నారు. రజినీపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రజినీ సరసన రమ్యకృష్ణ నటించగా... తమన్నా హీరోయిన్ గా చేసింది. ఇక శివరాజ్ కుమార్, మోహన్ లాల్ అతిథి పాత్రలో మెరిసారు.

తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటేనే భారీగా అంచనాలు ఉంటాయి. ఇక జైలర్ మీద కూడా మొదటి నుంచి మంచి హైప్ పెరిగింది. అందుకు తగ్గట్లుగానే భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా గా రూ. 122.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

జైలర్ మూవీ ఐదు రోజుల్లో... ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము లేపింది. దీంతో ఐదు రోజుల్లోనే తెలుగులో రూ. 39.70 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 96.85 కోట్లు, కర్నాటకలో రూ. 36.00 కోట్లు, కేరళలో రూ. 27.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 141.50 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 346.90 కోట్లు గ్రాస్, రూ. 170.25 కోట్లు షేర్ వచ్చింది ఈ సినిమాకు.

ఇక ఆరో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే... జైలర్ సినిమా ఆరో రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపింది. ఆరో రోజు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దేశవ్యాప్తంగా రూ.35కోట్లకు పైగా నెట్ వసూలు సాధించవచ్చని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా రూ. 174.15 నెట్ వసూలు చేయగా... 204.3 గ్రాస్ వసూలు చేసిందని తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో 136 కోట్లు సాధించవచ్చని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ... ఆరు రోజుల్లో రూ.400 కోట్లకు చేరవయ్యే అవకాశం ఉంది.
రజినీకాంత్ - నెల్సన్ కాంబినేషన్‌లో రూపొందిన 'జైలర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 122.50 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఇది రూ. 124 కోట్లు షేర్ టార్గెట్‌తో ఆడియెన్స్‌ను అలరించేందుకు వచ్చింది. ఇక, ఈ చిత్రం 6 రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా నెట్ రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో పాటు రూ. 90 కోట్లు మేర లాభాలను కూడా ఖాతాలో వేసుకుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











