Jailer Day 8 Collections: బాక్స్ ఆఫీస్ వద్ద జైలర్ రచ్చ.. ఎవరూ ఊహించని రేంజులో కలెక్షన్స్ ఏంటి భయ్యా?
తలైవా సూపర్ స్టార్ రజినీ కాంత్... మరోసారి తన సత్తా ఏంటో చూపించారు. చాలా కాలం తర్వాత మళ్లీ జైలర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించారు. 70 ఏళ్లు దాటాయి.. ఇంకా సినిమాలు ఏం చేస్తావ్ అనే వారికి జైలర్ సినిమాతో తనదైన స్టైల్ లో పంచ్ ఇచ్చారు రజినీ. ఇక ఆయన నటించిన ఈ జైలర్... బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఎనిమిదో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే....
రజినీ కాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఎప్పటిలాగానే రజినీ మూవీకి మరోసారి అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

తన కొడుకు మరణంపై ప్రతీకారం తీర్చుకునే రిటైర్డ్ జైలర్ గా రజనీ కాంత్ ఈ సినిమాలో నటించారు.ఈ సినిమాలో రజినీపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రజినీ సరసన రమ్యకృష్ణ నటించగా... తమన్నా హీరోయిన్ గా చేసింది. ఇక శివరాజ్ కుమార్, మోహన్ లాల్ అతిథి పాత్రలో మెరిశారు.
ఇక జైలర్ విడుదల అయినప్పటి నుంచి మంచి హైప్ పెరిగింది. అందుకు తగ్గట్లుగానే భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తమిళనాడులో రూ. 62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్నాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా గా రూ. 122.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుంది.

జైలర్ మూవీ ఏడు రోజుల్లో... ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము లేపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ.375.40కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని ఈ చిత్రం నిర్మించిన సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. తమిళ సినిమా (కోలీవుడ్) చరిత్రలో తొలి వారం అత్యధిక గ్రాస్ కలెక్షన్లను సాధించిన చిత్రంగా జైలర్ రికార్డు సృష్టించిందని పేర్కొంది. 'సూపర్ స్టార్ రజినీ కాంత్.. ది రికార్డ్ మేకర్' అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఇక జైలర్ మూవీ ఎనిమిదో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే... రూ.13.50 కోట్లు సాధించినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. జైలర్ సినిమా దేశవ్యాప్తంగా రూ. 225.65 కోట్ల నెట్ సాధించింది. ఇక ఓవర్సీస్ లో రూ. 147కోట్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.411.7 కోట్లు సాధించినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా అన్ని అంశాలు ఫలించి జైలర్ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. మరో మూడు, నాలుగు రోజుల్లోగానే రూ.500కోట్ల క్లబ్‍లోనూ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











