Jailer Day9 Collections: బాక్సాఫీస్ వద్ద జైలర్ ఊచకోత.. అదిదా రజినీ స్టామినా.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకే?
సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపిస్తున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం జైలర్. బీస్ట్ సినిమాతో విమర్శల పాలైన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ అయి 9 రోజులు అవుతున్నా... ఆగస్టు పదిన రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్స్ వసూలు చేస్తుంది ఇక తొమ్మిదవ రోజు కలెక్షన్స్ వివరాలకు వెళ్తే
సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశారు. ఆయన గత సినిమాలు ఫ్లాప్ అవుతూ రాగా.. మళ్లీ జైలర్ సినిమాతో హిట్టు కొట్టారు. ఇక జైలర్ తో మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేశారు అని చెప్పవచ్చు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా... కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఒక రిటైర్డ్ జైలర్ తన కుటుంబానికి సమస్య వస్తే ఎలా ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆగస్టు 10న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ మూవీలో రజనీకాంత్ స్టైల్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ రెండో వారంలో అడుగు పెట్టినా కూడా ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా అన్ని చోట్లా కలెక్షన్స్ తో సాధిస్తోంది.

రజినీకాంత్ నటించిన ఈ జైలర్ చిత్రం... బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి కలెక్షన్స్ అయితే సాధించింది. 8వ రోజుతో పోల్చితే 9వ రోజున మరోసారి మంచి ట్రెండ్ ని చూపిస్తూ రూ1.2 కోట్ల షేర్ ను సాధించినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక తమిళ్ లో సినిమా 3.5 కోట్ల సాధించగా.. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ మొత్తం మీద 5 కోట్ల మార్క్ ని అందుకుంటుందని తెలుస్తోంది.
జైలర్ మూవీ ఓవరాల్ గా 8 రోజుల్లో తెలుగులో రూ. 57.40 కోట్లు (తమిళ వెర్షన్ కలిపి), తమిళంలో రూ. 127.60 కోట్లు, కర్నాటకలో రూ. 48.85 కోట్లు, కేరళలో రూ. 37.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 157.35 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇక ఎనిమిదో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 437.65 కోట్లు గ్రాస్, రూ. 214.45 కోట్లు షేర్ రాబట్టింది.

ఇక తొమ్మిదో రోజు విషయానికి వస్తే... 9వ రోజున వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. 10 కోట్లకుపై గా ఇండియాలో గ్రాస్ కలెక్ట్ చేస్తే... ఓవర్సీస్ లో మూడు కోట్లకుపైగా కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. ఈ మూవీ ఇండియావైడ్ గా 235.85 కోట్ల నెట్ సాధించగా... 276.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాట్టనుంది. ఇక ఓవర్సీస్ లో 150 కోట్లకు పైగా రాబట్టినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 9 రోజుల్లో 450కోట్లు రాబట్టుగా.. ఇంకో రోజులో ఈ మూవీ 500కోట్లు వసూలు చేయనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











