Jailer USA Collections: జైలర్ కలెక్షన్ల అరాచకం.. యూఎస్ఏలో రజనీకాంత్ రికార్డుల ఊచకోత

సూపర్ స్టార్ రజినీకాంత్... ఆయన్ని అభిమానులు అంతా తలైవా అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే రజినీ నటించిన తాజా చిత్రం జైలర్. ఇక ఈ మూవీ ఆగస్టు 10న రిలీజ్ అయి... సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇండియావైడ్ కలెక్షన్స్ తో పాటు.. ఓవర్సీస్ లోనూ ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా యూఎస్ఏలో జైలర్ 4 మిలియన్ డాలర్ల మార్కును అందుకోబోతుంది. ఆ వివరాల్లోకి వెళితే...

తలైవా రజినీకాంత్.. బీస్ట్ ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ గురువారం నాడు రిలీజ్ అయి.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 250 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు యూఎస్ఏ లోనూ జైలర్ ఊచకోత మామూలుగా లేదని తెలుస్తోంది. ఈ మూవీ యూఎస్‌లో సంచలనాలు సృష్టిస్తోంది.

Jailer Movie All Set to Reach 4Million Dollar Mark in USA

జైలర్ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించగా... తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందన్ సంగీతం అందించారు. ఇక ఆయన అందించిన మ్యూజిక్ ఈ సినిమాను వేరే లెవెల్ కు తీసుకువెళ్లింది. ఇక ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రలు చేశారు.

జైలర్ మూవీ ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా మొదటి రోజు నుంచి థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. ఇలా ఈ చిత్రం నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ బెండు తీసేసిందని చెప్పవచ్చు. ఫలితంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను కూడా సాధించింది.

Jailer Movie All Set to Reach 4Million Dollar Mark in USA

జైలర్' మూవీ ఇండియాతో పాటు యూఎస్, కెనడా సహా చాలా దేశాల్లో విడుదలై సూపర్ హిట్టు టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా సందడి మరింత ముందుగానే ప్రారంభం అయింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు ఎన్నారైల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా యూఎస్ గడ్డపై రజినీకాంత్ సినిమా సంచలన వసూళ్లతో రికార్డుల మీద రికార్డులు నమోదు చేసింది.

'జైలర్' మూవీకి యూఎస్ ప్లస్ కెనెడాలో ప్రీమియర్ షోలకు 948K డాలర్లు వసూలు చేయగా... రెండో రోజు 620K డాలర్లు వచ్చాయి. ఇలా ప్రీమియర్ ప్లస్ ఫస్ట్ డేనే ఈ మూవీ 1.5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుని సత్తా చాటింది. ఇక మూడో రోజు 1మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. నాలుగో రోజు మాత్రం 570K డాలర్లు వసూలు చేసింది.

Jailer Movie All Set to Reach 4Million Dollar Mark in USA

యూఎస్‌లో అదిరిపోయే కలెక్షన్లతో సత్తా చాటిన 'జైలర్' మూవీ.. రెండో రోజు 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఇలా రెండు రోజుల్లో ఈ ఘనతను అందుకున్న తక్కువ చిత్రాల జాబితాలో చేరింది. అయితే మూడో రోజు కూడా ఊపును కొనసాగించడంతో పాటు సంచలనం సృష్టించింది. ఇలా ప్రీమియర్స్ ప్లస్ 3 రోజుల్లో 948K, 620K, 766K, 910K డాలర్లతో కలుపుకుని ఏకంగా 3.25 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక నాల్గో రోజుతో కలుపుకుని 4 మిలియన్ డాలర్ల మార్క్ కు చేరువైంది జైలర్. తద్వారా వేగంగా ఈ మార్క్ చేసిన చిత్రంగా నిలిచింది రజినీ మూవీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X