Jailer USA Collections: తలైవా శివ తాండవం.. పరాయి దేశంలో సంచలనం.. ఊహకే అందని ఊచకోత

అభిమానానికి సరిహద్దులు ఉండవు అన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా మారిన సినీ హీరోనే సూపర్ స్టార్ రజినీకాంత్. పేరుకు తమిళ హీరోనే అయినా ఇండియాతో పాటు ఎన్నో దేశాల్లో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న ఆయన.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రజినీకాంత్ తాజాగా 'జైలర్' అనే చిత్రంతో వచ్చారు. ఈ మూవీ యూఎస్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ రికార్డు సాధించింది. ఆ వివరాలు మీకోసం!

'జైలర్'గా వచ్చిన రజినీకాంత్: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన మూవీనే 'జైలర్'. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేయగా.. తమన్నా హీరోయిన్‌గా నటించింది. దీనికి అనిరుధ్ రవిచందర్సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు కీలక పాత్రలు చేశారు.

Jailer USA Collections:

భారీ రెస్పాన్స్‌... వసూళ్లు ఫుల్:సీనియర్ హీరో రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు నుంచి థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. ఇలా ఈ చిత్రం మూడు రోజుల్లో బాక్సాఫీస్ బెండు తీసేసింది. ఫలితంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను కూడా సాధించింది.

ఓవర్సీస్‌లో ఫుల్ రెస్పాన్స్‌తో:'జైలర్' మూవీ ఇండియాతో పాటు యూఎస్, కెనడా సహా చాలా దేశాల్లో విడుదలైంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా సందడి మరింత ముందుగానే ప్రారంభం అయింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు ఎన్నారైల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా యూఎస్ గడ్డపై రజినీకాంత్ సినిమా సంచలన వసూళ్లతో రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది.

Jailer USA Collections:

ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే ఇలా: నెల్సన్ దిలీప్ కుమార్ ధర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీకి యూఎస్ ప్లస్ కెనెడాలో ప్రీమియర్ షోలకు 948K డాలర్లను వసూలు అయ్యాయి. అదే ఊపును కంటిన్యూ చేస్తూ మొదటి రోజు కూడా ఈ సినిమాకు అక్కడ 620K డాలర్లు వచ్చాయి. ఇలా ప్రీమియర్ ప్లస్ ఫస్ట్ డేనే ఈ మూవీ 1.5 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుని సత్తా చాటింది.

2వ రోజే మరో ఘనత సొంతం: యూఎస్‌లో అదిరిపోయే కలెక్షన్లతో సత్తా చాటిన 'జైలర్' మూవీ.. రెండో రోజు కూడా వీర విహారం చేసింది. ఫలితంగా అక్కడ దీనికి 766K డాలర్లు వచ్చాయి. ఇలా నార్త్ అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్స్, ఫస్ట్ డే, సెకెండ్ డేలను కలుపుకుని ఏకంగా 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఇలా రెండు రోజుల్లో ఈ ఘనతను అందుకున్న తక్కువ చిత్రాల జాబితాలో చేరింది.

Jailer USA Collections:

3వ రోజు పెను సంచలనమే: యూఎస్ గడ్డపై 'జైలర్' మూవీ మూడో రోజు కూడా ఊపును కొనసాగించడంతో పాటు సంచలనం సృష్టించింది. తద్వారా శనివారం ఏకంగా 910K డాలర్లను వసూలు చేసింది. ఇలా ప్రీమియర్స్ ప్లస్ 3 రోజుల్లో 948K, 620K, 766K, 910K డాలర్లతో కలుపుకుని ఏకంగా 3.25 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తద్వారా వేగంగా ఈ మార్క్ చేసిన చిత్రంగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X