Jailer Total Collections: జైలర్ మూవీ టోటల్ కలెక్షన్స్.. కూలీతో రజనీ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడా?

తమిళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించి భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకడిగా, 50 ఏళ్లుగా తన స్టైల్, యాక్షన్, మేనరిజంతో అలరిస్తున్నారు రజనీకాంత్. 70 ఏళ్ల వయసులోనూ ఎలాంటి బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దశలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన చిత్రం జైలర్ రిలీజై ఘన విజయం సాధించింది. భారీ కలెక్షన్స్‌తో రజనీకాంత్ స్టామినాను ప్రపంచానికి చూపించింది. ఈ నేపథ్యంలో జైలర్ మూవీ టోటల్ కలెక్షన్స్ పరిశీలిస్తే..

జైలర్ బడ్జెట్ ఎంత?
జైలర్ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, వినాయకన్, వసంత్ రవి కీలకపాత్రలు పోషించారు. తమన్నా, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబులు గెస్ట్ పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చగా.. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి జైలర్ చిత్రానికి 220 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది.

Jailer Movie Total Collections Worldwide Rajinikanth Nelson Dilipkumar s Movie Budget Overal Collection and Target for Coolie

జైలర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో జైలర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా అందుకు తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడులో రూ.62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్లు, కర్నాటకలో రూ.10 కోట్లు, కేరళలో రూ.5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్లతో రూ.122.50 కోట్లు బిజినెస్ అయింది. జైలర్ లాభాల్లోకి రావాలంటే 124 కోట్ల రూపాయల షేర్.. 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో జైలర్ కలెక్షన్ ఎంత?
'జైలర్'మూవీ థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఏపీ, తెలంగాణలో భారీ ఆదరణ అందుకుంది. నైజాంలో రూ.22.84 కోట్లు, సీడెడ్‌లో రూ.6.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.6.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.3.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.1.83 కోట్లు, గుంటూరులో రూ.3.21 కోట్లు, కృష్ణాలో రూ.2.86 కోట్లు, నెల్లూరులో రూ.1.44 కోట్లతో.. రూ.48 కోట్లు షేర్, రూ.84 కోట్లు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో జైలర్ లాభం ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ జరగ్గా.. 13 కోట్లు రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో జైలర్ తన జర్నీని స్టార్ట్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న జైలర్.. ఫుల్ రన్‌లో 48 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. దీంతో ఏకంగా 35 కోట్ల రూపాయల లాభాలను అందుకుని రజనీకాంత్ సరికొత్త రికార్డును నమోదు చేశారు.

వరల్డ్‌ వైడ్‌గా జైలర్ లాభం ఎంత?
ఇక వరల్డ్ వైడ్‌గా జైలర్ కలెక్షన్స్ చూస్తే తమిళంలో 190 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 68 కోట్ల రూపాయలు, కేరళలో 57 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 17 కోట్లు, ఓవర్సీస్‌లో 197 కోట్ల రూపాయలు రాబట్టింది. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా జైలర్ మూవీ 606 కోట్ల రూపాయల గ్రాస్.. 296 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 122.50 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్‌కు గాను 124 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ట్రేడ్ పండితులు నిర్దేశించారు. ట్రేడ్ వర్గాల అంచనాలను తలక్రిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద 296 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. తద్వారా ఏకంగా 172 కోట్ల రూపాయల లాభాలను అందజేశారు రజనీకాంత్.

కూలీ ఎదుట టార్గెట్
జైలర్ సినిమా వచ్చిన రెండేళ్లకు, వెట్టయాన్ ఫ్లాప్ తర్వాత వస్తున్న రజనీకాంత్ చిత్రం కూలీ. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండటంతో పాటు అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతిహాసన్ తదితరులు నటిస్తుండటంతో కూలీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఏకంగా 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కూలీ.. జైలర్ రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X