Jalsa 4K Re Release Collection: పవన్ కళ్యాణ్ మేనియా.. రీ రిలీజ్‌లో జల్సాకు ఎన్ని కోట్లంటే?
ఇటీవలి కాలంలో రీ రిలీజ్‌లు మంచి వసూళ్లు కురిపిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు తమ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌తోనూ స్టార్స్ సినిమాలు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. గతంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ జల్సాను న్యూ ఇయర్ సందర్భంగా రీ రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఆంధ్రా, నైజాంతో పాటు వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ జల్సా చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఇలియానా డీ సౌజా, పార్వతి మెల్టన్, కమిలినీ ముఖర్జీ హీరోయిన్‌లుగా నటించగా.. ముఖేశ్ రిషి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, సునీల్, తనికెళ్ల భరణి, శివాజీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మల్లిఖార్జునరావు తదితరులు కీలకపాత్రలు పోషించారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించగా.. కేవీ గుహన్, రసూల్ ఎల్లోర్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సమ్మర్ కానుకగా 2008 ఏప్రిల్ 1వ తేదీన జల్సా విడుదలైంది.

జల్సాకు రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్
పవన్ కళ్యాణ్ ఛరిష్మా, త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్, ఇలియానా అందాలు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో జల్సా సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జల్సాకు అప్పట్లోనే రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతాయి. జల్సా ఆడియో రైట్స్‌ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ 90 లక్షల రూపాయలకు దక్కించుకుంది. ఇది ఓ తెలుగు సినిమా ఆడియో హక్కులపై ఆ రోజుల్లో దక్కిన అత్యధిక మొత్తంగా చరిత్ర సృష్టించింది. జల్సా డిజిటల్ సేల్స్‌కు కూడా మంచి ధర పలికింది. ఇక మొబైల్ రింగ్‌టోన్ డౌన్‌లోడ్స్ కింద 1.45 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాల నేపథ్యంలో జల్సాను వరల్డ్ వైడ్‌గా 400 ప్రింట్స్‌తో 1000 స్క్రీన్లలో విడుదల చేశారు.
29 కోట్ల రూపాయల షేర్
జల్సా కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 28.90 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. నైజాంలో 9.35 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4.50 కోట్ల రూపాయలు, వైజాగ్‌లో 2.85 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.05 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 1.80 కోట్ల రూపాయలు, కృష్ణాలో 1.80 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.05 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 25.40 కోట్ల రూపాయల చొప్పున షేర్ రాబట్టింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే తొలిసారి 25 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన చిత్రంగా జల్సా నిలిచింది.
రీ రిలీజ్‌లోనూ జల్సా హవా
ఇక రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యాయ.. జల్సా సినిమా కూడా మరోసారి కొత్త హంగులతో 4కే వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని 2022 సెప్టెంబర్ 3న విడుదలైన జల్సా మూవీ... రీ రిలీజ్‌లో 3.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఖుషి రీ రిలీజ్ అయ్యే వరకు రీ రిలీజ్‌లలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన పవన్ కళ్యాణ్ సినిమాలలో జల్సా టాప్‌లో ఉండేది.
న్యూఇయర్ కానుకగా మరోసారి జల్సా రీ రిలీజ్
తాజాగా న్యూఇయర్‌ను పురస్కరించుకుని డిసెంబర్ 31, 2025న మరోసారి జల్సా 4K వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. న్యూఇయర్ వైబ్, పవన్ క్రేజ్ నేపథ్యంలో జల్సాకు మరోసారి అదిరిపోయే బుకింగ్స్ జరుగుతున్నాయి. బుక్ మై షోలో గడిచిన 24 గంటల్లో 8 వేల టికెట్స్ వరకు అమ్ముడైనట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే సింగిల్ స్క్రీన్స్‌లో 99 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 105 రూపాయల చొప్పున టికెట్ ధర నిర్ణయించారు. డిసెంబర్ 30 వరకు అడ్వాన్స్ బుకింగ్‌లో 94 షోలకు గాను జల్సా 25.11 లక్షల రూపాయలు రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్‌తో కలిపి జనవరి 1వ తేదీ ఉదయం నాటికి జల్సాకు ఆల్ ఇండియా లెవల్‌లో 70 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో జల్సా 4K రీ రిలీజ్‌లో ఈసారి 1.50 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్‌లో కలెక్షన్స్ రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











