Avatar 2 వసూళ్ల సంచలనం.. నెరవేరిన జేమ్స్ కామెరాన్ కోరిక.. ఆరో సినిమాగా రికార్డ్!

అవతార్ అనే సినిమాతో యావత్ ప్రపంచం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. 2009లో విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో అవతార్ 2పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. అంచనాలకు తగినట్లుగా ఏన్నో ఏళ్ల శ్రమ తర్వాత డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది Avatar: The Way Of Water (Avatar 2).

తొలి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించిన అవతార్ 2 సినిమా తాజాగా సంచలనం క్రియేట్ చేసింది. దీంతో ప్రపంచ సినిమా చరిత్రలోనే ఆరో సినిమాగా అవతార్ 2 రికార్డ్ పొందగా.. అందులో మూడు జేమ్స్ కామెరాన్ సినిమాలు ఉండటం విశేషం.

ఇండియాలో 3800 స్క్రీన్లు..

ఇండియాలో 3800 స్క్రీన్లు..

పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్ గా అవతార్ సినిమాను తెరకెక్కించారు ప్రపంచ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్. దీంతో అవతార్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో 3800 స్క్రీన్లకు పైగా రిలీజ్ చేశారు. ఇతర దేశాల్లో 48200 స్క్రీన్లలో ప్రదర్శించారు. ఈ సినిమా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 52 వేల స్క్రీన్లలో ప్రదర్శించారు.

భారత్ లో రూ. 386 కోట్ల వసూళ్లు..

భారత్ లో రూ. 386 కోట్ల వసూళ్లు..

చంద్రగ్రహంల కనిపించే పండోరా గ్రహంపై ఉన్న సహజవనరులను కొల్లగొట్టాలనే ప్లాన్‌తో అమెరికా సైన్యం స్థానిక నావీ తెగపై దాడులకు పాల్పడే కథకు కొనసాగింపుగా అవతార్: ది వే ఆఫ్ ది వాటర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇండియాలో 5 వారాల పాటి ప్రదర్శించగా భారీ వసూళ్లు సాధించింది. భారతదేశంలో ఇంగ్లీష్ వెర్షన్ రూ. 206 కోట్లు, హిందీ వెర్షన్ రూ. 127 కోట్లు, తెలుగు రూ. 37 కోట్లు, తమిళ్ రూ. 18 కోట్లు, కేరళలో రూ. 8 కోట్లు, కర్ణాటకలో రూ. 22 కోట్లు వసూలు చేసింది. దీంతో అవతార్ 2 ఇండియాలో రూ. 386 కోట్ల వసూళ్లు సాధించింది.

2 బిలియన్ డాలర్స్ తో సంచలనం..

2 బిలియన్ డాలర్స్ తో సంచలనం..

అవతార్ 2 ఇండియాలో మొత్తంగా రూ. 386 కోట్లు సాధించడంతో 2022 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. గతంలో విడుదలై 'అవెంజర్స్: ఎండ్ గేమ్' భారత్ లో రూ. 367 కోట్లు వసూళు చేసి రికార్డు నెలకొల్పితే.. ఇప్పుడు అవతార్ 2 దాన్ని అధిగమించి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లు సాధించి మరో సంచలన రికార్డు నెలకొల్పింది.

6 సినిమాల్లో 3 అతనివే..

6 సినిమాల్లో 3 అతనివే..

విజువల్ వండర్‌గా తెరకెక్కిన అవతార్ 2 సినిమా దాదాపుగా 350 నుంచి 400 మిలియన్ డాలర్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 2 బిలిన్ డాలర్లు కొల్లగొట్టడంతో తర్వాత వచ్చే కలెక్షన్స్ అంతా లాభాల్లోకి వెళ్లనున్నాయని టాక్. ఇలా 2 బిలియన్ డాలర్లు వసూళు చేసిన ఆరో చిత్రంగా అవతార్ 2 మరో రికాలర్డ్ క్రియేట్ చేసింది.

ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా టైటానిక్ (1997), అవతార్ (2009), స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకన్స్ (2015), అవెంజర్స్: ఇన్ఫినటీ వార్ (2018), అవెంజర్స్: ఎండ్ గేమ్ (2019), అవతార్ 2 (2022) 2 బిలియన్ డాలర్లు వసూళు చేశాయి. వీటిలో టైటానిక్, అవతార్, అవతార్ 2 మూడు జేమ్స్ కామెరాన్ చిత్రాలు కావడం విశేషం.

అవతార్ 3పై హింట్..

అవతార్ 3పై హింట్..

అయితే ఈ అవతార్ 2 సినిమా 2 బిలియన్ డాలర్లు సాధిస్తేనే తాను తర్వాతి చిత్రం గురించి ఆలోచిస్తానని జేమ్స్ కామెరాన్ ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అవతార్ 2 రికార్డ్ తో జేమ్స్ కామెరాన్ కోరిక నెరవేరిందని చెప్పవచ్చు. ఇప్పుడు అవతార్ 3 ఎలా ఉంటుందని అభిమానులు, సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండనుందో ఇది వరకు చిన్న హింట్ ఇచ్చారు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్.

అగ్ని ఇతివృత్తంగా..

అగ్ని ఇతివృత్తంగా..

ఇటీవల ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ విభాగంలో అవతార్ 2 క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ అందుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేమ్స్ కామెరాన్.. అవతార్ 3 గురించి మాట్లాడారు. అవతార్ 3 అగ్ని (Fire) ప్రధానంగా ఉంటుందని చెప్పారు. "అగ్ని ఒక చిహ్నం. అది జీవరాశులకు ఎంతో అవసరం. అవతార్ మూడో భాగంలో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. సంస్కృతి మిళితమై కథ సాగుతుంది. ఇంతకుమించి ఎక్కువ చెప్పకూడదేమో. దీంతో పాటు మరో రెండు సంస్కృతులు కూడా పరిచయం అవుతాయి. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం" అని జేమ్స్ కామెరాన్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X