200 కోట్లతో జన నాయగన్ సంచలనం.. టాప్ 10లో విజయ్ మూవీ.. హాలీవుడ్‌కు షాక్!
జన నాయగన్ చిత్రం క్రిటిక్స్ రివ్యూను ఎదురిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నది. తమిళ దళపతి, ముఖ్యమంత్రి విజయ్ తన కెరీర్‌లో చివరి చిత్రంగా భావిస్తున్న ఈ సినిమా రికార్డు వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్నది. సినిమా రిలీజ్ తర్వాత పూర్తిస్థాయిలో మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ఈ చిత్రం రోజు రోజుకు కలెక్షన్లన పెంచుకొంటూ విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఇండియాలో జన నాయగన్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 43 కోట్ల రూపాయల నెట్, 50 కోట్ల గ్రాస్, రెండో రోజు 21 కోట్ల రూపాయల నెట్, 25 కోట్ల గ్రాస్, మూడో రోజు 29 కోట్ల రూపాయల నెట్, 34 కోట్ల రూపాయల గ్రాస్, నాలుగో రోజు 32 కోట్ల నెట్, 37 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 146 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక గత 4 రోజుల్లో ఈ చిత్రం తమిళనాడులో మోత మోగిస్తున్నది. తమిళనాడులో 84 కోట్ల రూపాయలు, కన్నడలో 24 కోట్ల రూపాయలు, కేరళలో 13 కోట్ల రూపాయలు, నార్త్, ఇతర ప్రాంతాల్లో 15 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 146 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియాలో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో 8వ స్థానంలో నిలిచింది.
ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లోను కాసుల పంట పడిస్తున్నది. విజయ్ క్రేజ్ ఏమిటో చెప్పకనే చెబుతూ నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, న్యూజిలాండ్, యూకే, గల్ఫ్ కంట్రీస్‌లో కలెక్షన్ల భారీగా వసూలు చేస్తున్నది. ఇప్పటి వరకు ఈ సినిమా 72 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది. దాంతో ఈ చిత్రం 218 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని తెలిపింది.
అయితే ఈ చిత్రం హాలీవుడ్ బాక్సాఫీస్ ట్రాకర్ రెంట్‌రాక్ (Rentrak) జాబితాలో చోటు సంపాదించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్న టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ది ఒడిస్సీ, మోనా లాంటి చిత్రాలతో పోటీ పడుతూ 7వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా అబ్సెషన్ మూవీ కంటే అధికంగా కలెక్షన్లు సాధిస్తున్నదని వెల్లడించింది. ఈ చిత్రం గత 4 రోజుల్లో సుమారుగా 22 మిలియన్ డాలర్లు అంటే.. 210 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని రెంట్‌రాక్ వెల్లడించింది. ఈ సినిమా దేశీయం సంచలనాలు నమోదు చేస్తూ ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా రికార్డు క్రియేట్ చేస్తున్నది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందనే కోణంపై ట్రేడ్ వర్గాలు దృష్టిపెట్టాయి.


Click it and Unblock the Notifications