Jana Nayagan Advance Box Office Collections: జన నాయగన్ అడ్వాన్స్ కలెక్షన్లు.. విజయ్ మూవీ వరల్డ్ వైడ్ ర్యాంపేజ్
తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరో విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించడంతో జన నాయగన్ చిత్రం తన కెరీర్‌లో చివరి చిత్రం కాబోతున్నది. దాంతో ఈ సినిమాను భారీ వ్యయంతో అంటే 300 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను ఓవర్సీస్‌లో ఫార్స్ ఫిలిం, సౌత్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నది. ఇటీవల మలేషియాలో అట్టహాసంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుమారుగా 1 లక్ష మంది అభిమానులు హాజరయ్యారు.
ఇలాంటి క్రేజ్, భారీ అంచనాల మధ్య జన నాయగన్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ భారీగా మొదలైంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 153 లోకేషన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. దాదాపు 250 షోలను ప్రదర్శిస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి 6 వేల నుంచి 6.5 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమా ఇప్పటికే 125000 డాలర్ల నుంచి 150000 డాలర్ల వరకు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన తమిళం, కన్నడలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగా, అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. బెంగళూరులో ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే ఓపెన్ చేసిన ప్రతీ స్క్రీన్‌లోను 55 నుంచి 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా ఇప్పటికే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. రానున్న రోజుల్లో భారీగా వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఆంధ్రా, నైజాంలో విజయ్ సినిమాలకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అది కాకుండా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉండటంతో భారీగా ఓపెనింగ్స్ కూడా ఉంటాయనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











