Jana Nayagan AP TG Business: జన నాయగన్ తెలుగు రైట్స్‌పై నిర్మాత ట్విస్ట్.. షాక్‌లో టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు?

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ మూవీ సెన్సార్ సంబంధ వివాదాల కారణంగా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడటంతో ఈ మూవీ బిజినెస్‌పై డైలమా నెలకొంది. అసలు జన నాయగన్ రిలీజ్ అవుతుందా? లేదా? అన్న అనుమానాలకు తోడు ఆన్‌లైన్‌లో పైరసీ ప్రింట్లు చక్కర్లు కొట్టడంతో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ తల పట్టుకుంది. అటు ఓటీటీ సంస్థ కూడా డీల్‌ను క్యాన్సిల్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అంచనాలను తారుమారు చేస్తూ దళపతి విజయ్.. తమిళనాడు సీఎం కావడంతో జన నాయగన్‌పై అందరిచూపు నెలకొంది.

Also Read
'అర్ధరాత్రి 3 గంటలైనా నాకే ఫోన్.. త్రిషకు నేనంటే ప్రాణం'
'అర్ధరాత్రి 3 గంటలైనా నాకే ఫోన్.. త్రిషకు నేనంటే ప్రాణం'

జన నాయగన్‌ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. దళపతి విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, సునీల్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీని దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Jana Nayagan AP TG Business KVN Productions Shocks Tollywood With Huge Demand for Vijay Film Telugu Rights

సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు, అత్యంత సున్నితమైన అంశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్.. జన నాయగన్‌ విడుదలకు అంగీకరించలేదు. దాంతో నిర్మాతలు కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ నిరాశే ఎదురైంది. నిర్మాతల పోరాటం కొనసాగుతున్న దశలో జన నాయగన్ మూవీ క్లిప్స్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడంతో చిత్ర యూనిట్ షాకైంది. ఆ తర్వాత ఏకంగా సినిమా మొత్తం కనిపించడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కోలీవుడ్ సహా అన్ని పరిశ్రమలకు చెందిన నటీనటులు జన నాయగన్‌కు అండగా నిలిచారు.

Recommended For You
నన్ను చంపాలని చేతబడి.. రక్తం వాంతులతో నరకం చూస్తున్నా.. జయం రవి ఆవేదన
నన్ను చంపాలని చేతబడి.. రక్తం వాంతులతో నరకం చూస్తున్నా.. జయం రవి ఆవేదన

సినిమా విడుదల ఆగిపోవడం, పైరసీ సీడీలు బయటకు రావడం, ఓటీటీ డీల్ క్యాన్సిల్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా అడ్వాన్స్‌లు వెనక్క ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయడంతో జన నాయగన్ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తీవ్ర ఇబ్బంది పడింది. పీకల్లోతు నష్టాలు తప్పవని భావిస్తుండగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ అనూహ్యంగా విజయం సాధించి ముఖ్యమంత్రి కావడంతో కేవీఎన్ ప్రొడక్షన్‌ మళ్లీ ఊపిరి పీల్చుకుంది. విజయ్ ఫాలోయింగ్‌క తోడు ఆయన సీఎం కావడంతో సినిమాపై మళ్లీ అంచనాలు పెరిగాయి. విజయ్ చివరి చిత్రం కావడంతో జన నాయగన్ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి తోడు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా విజయ్ గురించి చర్చించుకోవడంతో జన నాయగన్‌పై హైప్ ఎవరెస్ట్‌ను తాకింది.

You May Also Like
అలా నిన్ను చూడలేకపోతున్నాం... విష్ణుప్రియపై జబర్దస్త్ నటుడు షాకింగ్ కామెంట్స్
అలా నిన్ను చూడలేకపోతున్నాం... విష్ణుప్రియపై జబర్దస్త్ నటుడు షాకింగ్ కామెంట్స్

సెన్సార్ వివాదానికి ముందు జన నాయగన్ మూవీ రికార్డ్ బిజినెస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 220 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 210 కోట్ల రూపాయలు, కేరళ థియేట్రికల్ రైట్స్ 35 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 20 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 515 కోట్ల రూపాయల రికార్డ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. సినిమా విడుదల వాయిదా పడటంతో ఇదంతా సందిగ్ధంలో పడింది. అయితే ఇప్పుడు మరోసారి జన నాయగన్‌కు ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోవడంతో నిర్మాతలు భారీ ధర చెబుతున్నారట.

జబర్దస్త్‌లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ? పంచ్‌ల వర్షం ఎప్పటి నుంచి అంటే?
జబర్దస్త్‌లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ? పంచ్‌ల వర్షం ఎప్పటి నుంచి అంటే?

తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన గత చిత్రాలు ఇక్కడ భారీ వసూళ్లు నమోదు చేశాయి. జన నాయగన్ తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం బడా నిర్మాతలు క్యూ కడుతున్నారు. సితార నాగవంశీతో పాటు మరికొందరు నిర్మాతలు 15 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కేవీఎన్ ప్రొడక్షన్స్ మాత్రం 15 కోట్ల రూపాయల ఆఫర్ రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 33 కోట్ల రూపాయలకు మాత్రమే డీల్ కుదుర్చుకుంటామని చెబుతోందట. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి రీమేక్‌గా జన నాయగన్ తెరకెక్కించారని తెలుగు నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను తెలుగు ప్రజలు చూడటంతో తెలుగు రీమేక్ మూవీకి 33 కోట్లు పెట్టడం రిస్క్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. కానీ కేవీఎన్ ప్రొడక్షన్స్ మాత్రం రాజీ పడటం లేదు. దీంతో జన నాయగన్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత బిజినెస్ జరుగుతుందోనని ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X