Jana Nayagan Box Office: అడ్వాన్స్ బుకింగ్‌లో దళపతి జోరు.. రిలీజ్‌‌కు ముందే జన నాయగన్‌కు ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ జన నాయగన్. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో జన నాయగన్‌గా, తెలుగులో జన నాయకుడిగా, హిందీలో జననేతగా విజయ్ చిత్రం రానుంది. ఫుల్ టైం పొలిటీషియన్‌గా మారేందుకు గాను సినిమాలకు దళపతి విజయ్ రిటైర్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో జన నాయగన్ ఆయన సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా నిలిచింది.

విజయ్ క్రేజ్‌కు తోడు పాటలు, మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో జన నాయగన్‌ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌లో దూసుకెళ్తున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. జన నాయగన్ మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్‌లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Jana Nayagan Day 1 Advance Booking Collections Worldwide Thalapathy Vijay s last film crosses 15 crores mark in advance booking

జన నాయగన్‌ బడ్జెట్ ఎంత?
జన నాయగన్‌లో దళపతి విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, సునీల్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జన నాయగన్ మూవీని దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

జన నాయగన్ ప్రీ రిలీజ్ బిజినెస్
జన నాయగన్‌కు రికార్డు స్థాయిలో థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపు 121 కోట్ల రూపాయలకు దక్కించుకోగా.. ఆడియో రైట్స్‌ను టీ సిరీస్ సంస్థ 35 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ రైట్స్‌తో కలిపి ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ 200 కోట్ల రూపాయల వరకు జరిగినట్లుగా తెలుస్తోంది.

జన నాయగన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
జన నాయగన్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 100 కోట్ల రూపాయలు, మలయాళం థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలు, తెలుగు థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, హిందీ థియేట్రికల్ రైట్స్ 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌ థియేట్రికల్ రైట్స్ 80 మేర బిజినెస్ చేయగా.. కర్ణాటకలో కేవీఎన్ ప్రొడక్షన్స్ సొంతం రిలీజ్ చేయనుంది. తద్వారా థియేట్రికల్ బిజినెస్ కింద జన నాయగన్‌కు 200 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. దాంతో దళపతి మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్, 220 కోట్ల కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ రాబట్టాల్సి ఉంది.

జన నాయగన్ అడ్వాన్స్ బుకింగ్
నార్త్ అమెరికాలో దళపతి విజయ్ కంప్లీట్ డామినేషన్ ప్రదర్శిస్తున్నారు. జనవరి 8న ప్రీమియర్స్‌తో పాటు తొలిరోజు టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఒక్క అమెరికాలో 225 సెంటర్లలో, 514 షోలకు గాను 16,821 టికెట్లు సేల్ అవ్వగా.. 344155 డాలర్లు (3.09 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఓవరాల్‌గా నార్త్ అమెరికాలో 470K (4.23 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ అమెరికాతో పాటు యూకే, ఆస్ట్రేలియాల నుంచి ఈ సినిమాకు మేజర్ షేర్ లభించినట్లుగా తెలుస్తోంది.

అడ్వాన్స్ బుకింగ్‌లో ఎన్ని కోట్లంటే?
ఇండియాలోనూ జన నాయగన్ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్‌‌లో రికార్డులు సృష్టిస్తున్నాడు. మనదేశంలో ప్రస్తుతానికి కేరళ, కర్ణాటకలలో మాత్రమే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యింది. సెన్సార్ సర్టిఫికేట్ జారీలో ఆలస్యం కారణంగా తమిళనాడులో ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. కర్ణాటకలో 130 షోలకు గాను 3.25 కోట్ల రూపాయలు రాబట్టాడు. బెంగళూరుతో పాటు కర్ణాటకకు అనుకుని ఉండే సరిహద్దు జిల్లాల్లో జన నాయగన్ మేనియా నడుస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు జన నాయగన్ వరల్డ్ వైడ్‌గా ప్రీ సేల్స్‌లో 15 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తమిళనాడు బుకింగ్ కనుక ఓపెన్ అయితే ఈ మొత్తం ఊహకందని విధంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం జన నాయగన్ తొలిరోజు 60 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X