Jana Nayagan Day 1 Box Office: జన నాయగన్ కలెక్షన్ల సంచలనం..విజయ్ కెరీర్‌లోనే రికార్డు వసూళ్లు? ఎన్ని కోట్లంటే
తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.
ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

జన నాయగన్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మొత్తంగా 210 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ 213 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 423 కోట్ల రూపాయల మేర క్లోజ్ అయింది. నిర్మాతలు, కేవీఎన్ ప్రొడక్షన్‌కు ఈ సినిమా రిలీజ్‌కు ముందే 70 కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో ఇటీవల ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్‌కు రికార్డు లెవెల్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. ఇప్పటికే తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు సంబంధించి ప్రీమియర్లు, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ సుమారుగా 4 మిలియన్ డాలర్లు మేర జరిగింది. దాదాపు అమెరికా, కెనడాలోనే ఈ సినిమా 36 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక అమెరికేతర దేశాలు అంటే మలేషియా, సింగపూర్, యూకే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతున్నది. యూకేలో 45 వేల టికెట్లు, అమెరికాలో 2 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా తాజా సమాచారం ప్రకారం 60 కోట్ల రూపాయలకుపైగానే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల రూపంలోనే వసూలు అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇక ఈ సినిమా ప్రీమియర్లతో కలిపి తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో రికార్డు వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా మొదటి రోజు 120 నుంచి 140 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంటే.. ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి


Click it and Unblock the Notifications











